రఘునందన్ రావుపై రేపిస్టు వ్యాఖ్యలు: ఆ కథాకమామిషు ఇదీ...

First Published Oct 7, 2020, 5:04 PM IST

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ సమయంలో స్వంత పార్టీ నేతలే ఆయనపై విమర్శలు చేయడం కలకలం రేపుతోంది.

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావుపై అదే పార్టీ నేత తోట కమలాకర్ రెడ్డి చేసిన తీవ్ర విమర్శలు చర్చనీయాంశమయ్యాయి.
undefined
ఎన్నికల సమయంలో రఘునందన్ రావుపై కమలాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. రఘునందన్ రావుపై రేపిస్ట్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్దులకు వరంగా మారే అవకాశం లేకపోలేదు.
undefined
దుబ్బాక అభ్యర్ధిని మార్చాలని కూడ ఆయన డిమాండ్ చేశారు. తీవ్ర ఆరోపణలు చేసిన కమలాకర్ రెడ్డిపై బీజేపీ నాయకత్వం చర్యలు తీసుకొంది. పార్టీ నుండి కమలాకర్ రెడ్డిని బహిష్కరించింది..కమలాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రఘునందన్ రావుపై గతంలో మహిళ చేసిన ఆరోపణలు మరోసారి తెరమీదికి వచ్చాయి. ఈ మహిళ ఆరోపణలను కమలాకర్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశంలో ప్రస్తావించారు.
undefined
ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ఓ వివాహిత బీజేపీనేత రఘునందన్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసింది. రఘునందన్ రావు తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది.ఈ విషయమై పోలీసులకు కూడ ఫిర్యాదు చేసినట్టుగా ఆమె తెలిపింది.2007 డిసెంబర్ 2వ తేదీన ఈ ఘటన జరిగిందని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపింది.
undefined
ఈ విషయం మీడియాలో పెద్ద ఎత్తున రావడంతో కొద్దికాలం పాటు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న రఘునందన్ రావు టీవీ చర్చలకు కూడ కొద్దికాలం పాటు దూరంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన మీడియా చర్చల్లో పాల్గొంటున్నారు.
undefined
దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ అభ్యర్ధిని ప్రకటించకముందే ఆయన తన ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. అయితే మంగళవారం నాడు బీజేపీ తన అభ్యర్ధిని ప్రకటించింది.
undefined
టీఆర్ఎస్ అసమ్మతి నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత బీజేపీ తన అభ్యర్ధిని ప్రకటించింది.రఘునందన్ రావుకు బీజేపీ టికెట్టు దక్కడంతో కమలాకర్ రెడ్డి ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించడం ప్రాధాన్యత సంతరించుకొంది.
undefined
బీజేపీ అభ్యర్ధిగా ప్రకటనకు ముందు రోజే తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రఘునందన్ రావుపై నమోదైన కేసుల్లో అరెస్ట్ తో పాటు ఇతర బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.
undefined
రఘునందన్ రావుపై రాయపోల్ పోలీస్ స్టేషన్ లో సిద్దిపేటకు చెందిన మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద నమోదైన అన్ని చర్యలకు స్టే ఇవ్వాలని రఘునందన్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ లక్ష్మణ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
undefined
ఈ నెల 5వ తేదీన హైద్రాబాద్ కు సమీపంలోని షామీర్‌పేటలో దొరికిన 40 లక్షల రూపాయాలు కూడ కలకలం రేపుతున్నాయి. ఈ డబ్బును తీసుకెళ్తున్నవారితో రఘునందన్ రావు పీఏ ఫోన్ లో మాట్లాడినట్టుగా తాము గుర్తించామని బాలానగర్ డీసీపీ పీవీ పద్మజ చెప్పారు. ఈ డబ్బును బీజేపీ అభ్యర్ధి దగ్గరి బంధువుకు అప్పగించబోతున్నారని తమ విచారణలో తేలిందని డీసీపీ ప్రకటించింది.
undefined
click me!