Rythu Runa Mafi
Rythu Runa Mafi : ఎన్నికల హామీని నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేపట్టింది. ప్రస్తుత తెలంగాణ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో రుణమాఫీ అసాధ్యమని ప్రత్యర్థులు అంటుంటే... ఆగస్ట్ 15లోపే ఆ పని చేసి చూపిస్తానని రేవంత్ ఛాలెంజ్ చేసారు. అన్నట్లుగానే ఇప్పటికే రెండు విడతల్లో లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేసారు... ఆగస్ట్ లో మిగతా రుణాల మాఫీకి సిద్దమయ్యారు. అయితే రేవంత్ సర్కార్ రుణమాఫీ మోసపూరితంగా వుందని... కొందరు రైతుల రుణాలను మాత్రమే మాఫీ చేసి తామేదో గొప్పపని చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సవాలక్ష ఆంక్షలు పెట్టి అర్హులైన రైతులను కూడా అనర్హులుగా మార్చి ఈ రుణమాఫీ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
Rythu Runa Mafi
తాజాగా కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా రైతు రుణమాఫీపై స్పందించారు. ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు... ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారన్నారు. కానీ ఇప్పుడు ఏవో కారణాలు చెబుతూ రైతుల రుణాలను మాఫీ చేయకుండా మోసం చేస్తున్నారని అన్నారు. ఎవరి రుణాలు మాఫీ అవుతున్నాయో తెలీదు... కానీ రాష్ట్రంలో మెజారిటీ రైతుల రుణాలు మాత్రమే అలాగే వున్నాయన్నారు. లక్షలాది మంది రైతులు రుణాలు మాఫీ కాక ఆందోళనతో ఉన్నారన్నారు.
Rythu Runa Mafi
ఇలా రుణమాఫీ కాక ఆవేదనలో మునిగిన రైతులకు న్యాయం జరిగేలా తెలంగాణ బిజెపి పోరాటం చేస్తుందని కిషన్ రెడ్డి ప్రకటించారు. బాధిత రైతులకు అండగా నిలవాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది... అందులో భాగంగానే ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలు మాఫీ చేయకుండా అన్యాయం చేసిన రైతులు బిజెపి హెల్ప్ లైన్ నంబర్ 8886 100 097 కు ఫోన్ చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. రైతుల పక్షాల కాంగ్రెస్ సర్కార్ ను నిలదీస్తామంటూ పోస్టర్ ను రిలీజ్ చేసి, హెల్ప్ లైన్ సేవలను ప్రారంభించారు తెలంగాణ బిజెపి అధ్యక్షులు.
Rythu Runa Mafi
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేసామంటోంది...కానీ క్షేత్రస్థాయిలో రుణాలు మాఫీ అయినవారి కంటే కానివారే ఎక్కువగా వున్నారన్నారు. ఇలా రుణమాఫీ అందని రైతుల వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయిన రైతులకు బిజెపి అండగా వుంటుందని... వారికి సాయం అందించేలా కార్యాచరణ రూపొందించినట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు.
Rythu Runa Mafi
అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి డిమాండ్ చేసారు. రైతుల కోసం ఏర్పాటుచేసిన హెల్ప్ లైన్ నెంబర్ కు చాలా ఫోన్స్ వస్తున్నాయని... ప్రతిఒక్కరు తమను కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని అంటున్నారని తెలిపారు. తమ ఆవేదనను వెల్లబోసుకుంటున్న రైతులు తమకు న్యాయం చేయడం బిజెపితోనే సాధ్యమని అంటున్నారని పేర్కొన్నారు. వారి మాటలు వింటుంటే బిజెపిపై రైతులకు ఎంత విశ్వాసం వుందో అర్థమవుతుందన్నారు కిషన్ రెడ్డి.
Rythu Runa Mafi
ఏ ప్రాతిపదికన రుణమాఫీ అర్హులను ఎంపిక చేస్తున్నారు..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. చాలా గ్రామాల్లో రైతులు రుణమాఫీ జరక్క బ్యాంకుల్లో డీఫాల్డర్ గా మారే పరిస్థితి వచ్చిందన్నారు.ఇలా దిక్కుతోచని పరిస్థితిలో రైతులు ఆందోళనలో మునిగిపోయారు... ఈ రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. రుణమాఫీ చేస్తున్నామంటూ కోట్ల రూపాయలతో ప్రచారం చేసుకోవడం కాదు... ఆ డబ్బులు రైతుల కోసం ఉపయోగించాలని కేంద్ర మంత్రి సూచించారు.
Rythu Runa Mafi
రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, ఎకరానికి రూ. 15,000 పెట్టుబడి సాయం, కౌలు రైతులకు రూ. 15,000 ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది... కానీ ఏ ఒక్కటీ సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. ఆరు గ్యారంటీలు, వడ్లకు బోనస్ ఏమయ్యాయి..? అని ప్రశ్నించారు. అధికారం కోసం రైతులకు మోసపూరిత గ్యారంటీలు ఇవ్వడం... అధికారంలోకి రాగానే రైతులను దగా చేయడం... నాడు బీఆర్ఎస్ చేసిందే నేడు కాంగ్రెస్ చేస్తోందన్నారు.
గ్యారంటీల పేరుతో గారడీలు చేయడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజమని కిషన్ రెడ్డి మండిపడ్డారు.