తెలంగాణ హోంమంత్రి మల్లన్న..!!

First Published | Jul 30, 2024, 11:54 PM IST

తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి ఎలాంటి సరదా వ్యక్తో అందరికీ తెలిసిందే. ఆయన తాజాగా హోంమంత్రి పదవిపైనా తనదైన స్టైల్లో కామెంట్ చేసారు. ఆయన ఏమన్నారంటే.. 

malla reddy

Mallareddy : ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే టక్కున రేవంత్ రెడ్డి పేరు చెబుతారు. అదే హోంమంత్రి ఎవరంటే   మాత్రం చాలామంది తడబడతారు... ఆలోచనలో పడతారు. ఇంతకూ రాష్ట్ర హోంమంత్రి ఎవరో కాదు రేవంత్ రెడ్డే. కీలకమైన హోంశాఖ ఆయన వద్దనే వుంది. త్వరలోనే మంత్రివర్గ వుంటుందనే ప్రచారం నేపథ్యంలో హోంమంత్రి ఎవరికి దక్కుతుందోననే చర్చ జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు,

malla reddy

మాజీ మంత్రి, మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత చామకూర మల్లారెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు వుండరు. ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులమయమే... తన మాటలతో ఎంత సీరియస్ వాతావరణాన్ని అయినా కూల్ చేయగల నేర్పరి. వేలకోట్ల వ్యాపారాలకు అధిపతి, రాజకీయ నేపథ్యమున్న మనిషి గంభీరంగా కాకుండా చాలా ఫన్నీగా వుండటమే ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. 
 


malla reddy

ఇక పూలమ్మినా, పాలమ్మినా అంటూ ఆయన కొట్టిన ఓ డైలాగ్ సోషల్ మీడియాలో ఫేమస్. ఇలా మల్లారెడ్డి ఏం మాట్లాడిన చాలా సరదాగా వుంటుంది. ఇలా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు మల్లారెడ్డి. 
 

malla reddy

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మల్లారెడ్డితో మీడియా ప్రతినిధులు మల్లారెడ్డితో మాట్లాడారు.ఈ సందర్భంగా తనదైన స్టైల్లో సరదాగా మాట్లాడారాయన. ఒకవేళ బిఆర్ఎస్ మూడోసారి గెలిస్తే తాను హోంమంత్రిని అయ్యేవాడినంటూ మల్లారెడ్డి నవ్వుతూ చెప్పారు. అంతేకాదు తమ ప్రభుత్వమే వుంటే సినిమాలు తీసేవాడినని... టివి ఛానల్ పెట్టేవాడినని అన్నారు. ఇప్పుడు గనక తమ ప్రభుత్వం వుండివుంటే తన లెవెల్ మరోలా వుండేదంటూ మల్లారెడ్డి అన్నారు. 
 

mallareddy

అయితే మల్లారెడ్డి ఈ కామెంట్స్ నవ్వుతూనే చేసినా వాటిలో సీరియస్ నెస్ కూడా వుంది. సినిమా వాళ్లతో మల్లారెడ్డి సన్నిహితంగా  వున్నారు...తరచూ సినిమా ఫంక్షన్లలో పాల్గొనేవారు. కాబట్టి ఆయన సినిమాల విషయంలో మనసులోని మాటే బయటపెట్టారని అంటున్నారు. ఇక హోంమంత్రి, టివి ఛానల్ ఆశలు కూడా మల్లారెడ్డికి వున్నట్లు అర్థమవుతుంది. 

Latest Videos

click me!