నిమ్స్ లో కార్పోరేట్ స్థాయి వైద్య సేవలు.. త్వరలో రోబోటిక్ సర్జరీ సేవలు : హరీశ్ రావు

First Published Dec 7, 2021, 2:26 PM IST

ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఎండోస్కోపీక్ ఎక్విప్మెంట్, ఎం అర్ యు ల్యాబ్, స్టెమ్ సెల్ రీసెర్చ్ ఫెసిలిటీ, ఫిజియోథెరపీ విభాగం, బోన్ డెన్సిటోమీటర్, శాంపిల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం వాటర్ ఏటిఎం లను  మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మంత్రి అన్ని విభాగాల హెచ్ఓడి లతో సమీక్ష నిర్వహించారు. 

minister harish rao visit to nims

ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఎండోస్కోపీక్ ఎక్విప్మెంట్, ఎం అర్ యు ల్యాబ్, స్టెమ్ సెల్ రీసెర్చ్ ఫెసిలిటీ, ఫిజియోథెరపీ విభాగం, బోన్ డెన్సిటోమీటర్, శాంపిల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం వాటర్ ఏటిఎం లను  మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మంత్రి అన్ని విభాగాల హెచ్ఓడి లతో సమీక్ష నిర్వహించారు. 

minister harish rao visit to nims

సమీక్ష తరువాత మీడియాతో మాట్లాడుతూ..

12 కోట్లతో వివిధ మెడికల్ ఎక్విప్మెంట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. అందులో ముఖ్యంగా మెడికల్ జెనటిక్ ల్యాబరెటరీ అందుబాటులోకి వచ్చిందన్నారు. వారసత్వంగా వచ్చే జన్యు లోపాలను సవరించే అత్యాధునిక లాబ్ ను రాష్ట్ర ప్రజలకు అందుబాటులో తేచ్చామని చెప్పారు. 

minister harish rao visit to nims

దీంతోపాటు నిమ్స్ లో మల్టీ డిసిప్లనరీ రిసెర్చ్ యూనిట్ అందుబాటులోకి తెచ్చాం అన్నారు. బోన్ డెన్సిటీవ్ మీటర్ ను అందుబాటులోకి తెచ్చాం. బోన్స్ డెన్స్ ఎంత ఉంది అని టెస్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఎక్కడా లేదు. బోన్స్ ఎంత స్ట్రెంత్ ఉన్నది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తొలి సారిగా ఇది రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో తెచ్చాం అని చెప్పారు.

minister harish rao visit to nims

న్యుమాటిక్ వ్యూ సిస్టమ్ తెచ్చాం. టెస్టింగ్ శాంపిల్స్ ను అందులో పెడితే అది ల్యాబ్ లోకి వెళుతుంది. తిరిగి ఆ ఫలితాలు రిటర్న్ తెస్తుంది.  రెండున్నర కోట్లతో ఇది తెచ్చామన్నారు.

minister harish rao visit to nims

నిమ్స్ లో గతంలో బెడ్ దొరకడం కష్టంగా ఉండేది. కేసీఆర్ గారు నిమ్స్ ను బలోపేతం చేయాలని, మరో 200 పడకల ఐసీయూ బెడ్స్ ను మంజూరు చేశారు.  ఈ 200 బెడ్స్  జనవరి 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు ఇవి పూర్తయితే పేద ప్రజలకు నిమ్స్ లో 350 ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి వస్తుంది.

minister harish rao visit to nims

ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ బెడ్స్ పూర్తయితే పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తాం. వెంటిలెటర్ గతంలో దొరకాలంటే కష్టంగా ఉండేది. పేదవాళ్లు వెంటిలెటర్ పై ఉండాలంటే లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది.  ఈ వెంటలేటర్ 89 మాత్రమే ఉన్నాయి. 120 వెంటి లెటర్లు కొత్తవి తెస్తున్నాం. మొత్తం 209 వెంటిలెటర్లు అందుబాటులోకి వస్తాయి. వచ్చే 45 రోజుల్లో వెంటిలెటర్లు, ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి తెవాలని ఆదేశించడం జరిగింది.

minister harish rao visit to nims

హెచ్ వోడీలతో మాట్లాడితే కార్పోరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం ప్రభుత్వ రంగంలో అందించాలంటే కొంత ఎక్విప్మెంట్ కావాలన్నారు. రెడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమస్ట్రీ, నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ డిపార్టమెంట్ల నుండి రిక్వేస్ట్ వచ్చాయి.  ఈ ఎక్విప్మెంట్ కావాలన్నారు. 153 కోట్లు అవసరం. 

రోబోటిక్ సర్జరీ ఇందులో ముఖ్యమైనది. చెతి వేళ్లు వెళ్లలేని చోట రోబోటిక్ సర్జరీ ఇది 12 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది కావలని కోరడం జరిగింది. ప్రభుత్వ రంగంలో రోబోటిక్ సర్జరీ అందుబాటులో లేదు. ఇతర డిపార్ట్మెంట్లకు కావాల్సిన అత్యాధునిక మెడికల్ యంత్ర పరికరాలు కావాలన్నారు.

minister harish rao visit to nims

రేడియో థెరపీలో లినాక్ ఎక్విప్మెంట్ 20 కోట్లు  ఖర్చు ఉంటుంది. అని అంకాలజీ డిపార్మెంట్ అడిగారు. ఇవన్నీ మంజూరు చేయాలన్నారు.

154 కోట్లు  ఈ కొత్త ఎక్విప్మెంట్ కొనడానికి ఇవాళ మంజూరు చేస్తున్నాం. ఈ స్థాయి పెంచాలి. కార్పోరేట్ ఆస్పత్రులతో పోటీ పడి వైద్య సేవలు అందాలన్నది మా లక్ష్య.

 ఆరోగ్య శ్రీ కింద ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్  చేస్తున్నాం. ఇప్పుడు 5 గురు అక్కడ చికిత్స పొందుతున్నారు.  నిమ్స్ లో 8 పడకల బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ పడకలున్నాయి

minister harish rao visit to nims

ఇలా ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. నిమ్స్ తో పాటు  మరో 4 ఆస్పత్రులు తెవడానికి ప్రయత్నిస్తున్నాం. అధికారులు అంచనాలు తయారు చేస్తున్నారు. 

అల్వాల్ లో, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ లో, టిమ్స్ లో , ఛెస్ట్ ఆస్పత్రిలో నాలుగు వైపులా వెయి పడకల ఆస్పత్రులు ,తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ కింద ఈ నాలుగు సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు తెవాలని సీఎం కేసీఆర్ గారు నిర్ణయించారు.

minister harish rao visit to nims

నిమ్స్ లో పడకలు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. 
హైరిస్క్ ప్రెగ్నెంట్ పెషెంట్ల కోసం ఇ్బబంది ఉంది. నిమ్స్ లో ఈ సౌకర్యం లేదు. గర్భిణీ స్త్రీ కిడ్నీ, గుండె, హై బీపీ తో బాధపడవచ్చు. అలాంటి వాళ్లకు సాయం చేసేందుకు గైనకాలజీ డిపార్ట్ మెంట్ పెట్టాలని  అడిగారు. 200 పడకల  ఎంసీహెచ్ ఆస్పటిల్ ను నిమ్స్ కు అటాచ్డ్ గా తేవాలని నిర్ణయించాం. రాష్ట్రంలో హై రిస్క్ గర్భిణీ స్త్రీలకు చక్కటి వైద్యం ఇచ్చే అవకాశం ఉంటుంది.

పేమెంట్ కింద చేరి ఎల్ వోసీ వస్తుంది. ఆరోగ్య శ్రీ కింద కొద్ది మంది చేరుతున్నారు.  ఆరోగ్య శ్రీ కింద భోజనం వస్తుంది, పేమెంట్ కింద చేరిన వారికి  భోజనం రావడం లేదు. అందరికీ భోజనం పెట్టాలని నిమ్స్ డైరెక్టర్ కు ఆదేశించడం ఇవ్వడం జరిగింది. డాక్టర్ చెప్పిన డైట్ అందరి పేషంట్లకు ఇవ్వాలని ఆదేశించడం జరిగింది.

minister harish rao visit to nims

- జీహెచ్ఎంసీ వాళ్లతో మాట్లాడి 5 రూ. బోజనం ఇక్కడ  రోగుల సహాయకులకు పెట్టాలని నిర్ణయించాం. త్వరలోనే 5 రూపాయలకే భోజనం పెట్టిస్తాం.
- ఒమిక్రాన్ కేసులు తెలంగాణలో రాలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.
- ప్రతి ఒక్కరూ కో నిబంధనలు పాటించాలి. ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు. 13 కేసులు నెగిటివ్ వచ్చాయి. 

- సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వాక్సిన్ ప్రచారం నిర్వహించాలి.
- సీఎం కేసీఆర్ ఆదేశాలతో ..ప్రతి రోజు లక్ష దాకా నిర్దారణ పరీక్షలు చేయాలని నిర్ణయించాం.

click me!