తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్:బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్

First Published | Oct 4, 2023, 12:31 PM IST

తెలంగాణలో బస్సు యాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ యాత్రలో పార్టీ కీలక నేతలు పాల్గొంటారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్:బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్

తెలంగాణలో బస్సు యాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. బస్సు యాత్ర చేయాలని గతంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు సూచనప్రాయంగా అంగీకరించారు. అయితే  బస్సు యాత్ర ఎప్పుడు చేయాలనే దానిపై  నిర్ణయం తీసుకోలేదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్:బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్

మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు  షెడ్యూల్ ను  మరో వారం రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో  బస్సు యాత్రపై  కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది.  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత యాత్రను కాంగ్రెస్ నేతలు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

Latest Videos

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్:బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్

తమ పార్టీ అధికారంలోకి వస్తే  ఆరు హామీలను అమలు చేస్తామని  కాంగ్రెస్ ప్రకటించింది.  గ్యారంటీ పథకాలతో పాటు బీఆర్ఎస్ వైఫల్యాలను  బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరో వైపు  ఇతర డిక్లరేషన్లను కూడ ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్:బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2004 ఎన్నికలకు ముందు  వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డీఎస్ సహా పార్టీ కీలక నేతలంతా బస్సు యాత్ర నిర్వహించారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర తర్వాత  ఈ బస్సు యాత్ర నిర్వహించారు.ఈ రెండు యాత్రల ద్వారా కాంగ్రెస్ కు  కలిసి వచ్చిందని ఆపార్టీ  నేతలు అప్పట్లో భావించారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్:బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్

గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినివాసంలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో బస్సు యాత్రపై  చర్చించారు. ఆ తర్వాత జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో కూడ  బస్సు యాత్ర చేయాలని నేతలు  నిర్ణయించారు.
బస్సు యాత్ర విషయమై పార్టీ నేతలతో ఆ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోలు కూడ చర్చించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్:బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్

బస్సు యాత్ర పది నుండి 12 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. ఆదిలాబాద్ నుండి యాత్ర ప్రారంభించాలని కాంగ్రెస్ నేతలు సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే యాత్ర ఎప్పుడు ప్రారంభించాలనే దానిపై ఆ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్:బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియను కూడ వేగంగా పూర్తి చేయాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఈ నెల రెండో వారంలో  జాబితాను విడుదల చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే  40 మంది  అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.  మొత్తం 70 మంది అభ్యర్థుల జాబితాపై  కాంగ్రెస్ నాయకత్వం  వడపోసింది.  

click me!