గాడిదలు కాస్తున్నారా? గుడ్డి గుర్రాల పళ్ళు తోముతున్నారా?:కేసీఆర్ సర్కార్‌పై భట్టి నిప్పులు

First Published | Sep 2, 2020, 1:12 PM IST

కోవిడ్19 విలయతాండవం నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అందుతున్న సదుపాయాలు, సౌకర్యాలను భట్టి విక్రమార్క మల్లు సారధ్యంలోని సీఎల్పీ బృందం పరిశీలించారు. 

నాగర్ కర్నూల్:ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులను కూడా ఆరున్నర ఏళ్లుగా భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ గాడిదలు కాస్తున్నారా లేక.. గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా... అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు.
కోవిడ్19 విలయతాండవం నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సదుపాయాలు, సౌకర్యాలను భట్టి విక్రమార్క మల్లు సారధ్యంలోని సీఎల్పీ బృందం పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం భట్టి విక్రమార్క బృందం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించింది.

అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ...నాగర్ కర్నూల్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో గత ప్రభుత్వం కట్టిన భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు తప్ప కేసీఆర్ ప్రభుత్వం ఈ ఆరేళ్ళల్లో కొత్తగా చేసిందేమీ లేదని అన్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది నియమకాలు కూడా ఈ ప్రభుత్వం చేయలేదని అన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి అంటే 350 పడకల ఆస్పత్రిగా ఉండాలి కానీ ఇది ఇంకా 100 పడకల ఆస్పత్రుగానే ఉందని... అంతేకాకుండా వంద పడకల ఆసుపత్రికి ఉండాల్సిన కనీస సదుపాయాలు కూడా ఇక్కడ లేవని భట్టి విక్రమార్క నిప్పులు వివరించారు.
కరోనా రోగులను పరీక్షించే సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ అసలు లేవని..ఇక ఎక్స్ రే మిషన్ కూడా పని చేయడం లేదని పేర్కొన్నారు. రోగులకు వైద్యం చేయాల్సిన డాక్టర్ల పోస్టులు అన్ని ఖాళీగానే ఉన్నాయని భట్టి చెప్పారు. మొత్తంగా ఇక్కడ 49 డాక్టర్ల పోస్టులు మంజూరు అయితే 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయని భట్టి పేర్కొన్నారు.
''వైద్యో నారాయణో హరి అంటాము. వైద్యుడు దేవుడితో సమానం. ఇప్పుడున్న కరోనా సమయంలో వైద్యులు కళ్ళముందు నడిచే దేవుళ్ళు.. ఆసుపత్రులు దేవాలయాలు. అయితే కేసీఆర్ సర్కార్ డాక్టర్ల పోస్టులు భర్తీ చేయకుండా ఆసుపత్రులను దేవుళ్ళు లేను దేవాలయాలుగా మార్చారు. వైద్యులు లేని ఈ ఆసుపత్రికి వచ్చే పేదలకు ఎటువంటి వైద్య సహాయం అందుతుంది'' అని భట్టి మండిపడ్డారు.
''ప్రతి నియోజకవర్గంలోనూ ప్రభుత్వం కరోనను కట్టడి చేసేందుకు పేద ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఐసోలేషన్ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. హోమ్ క్వారయింటైన్ వల్ల గ్రామాల్లో కరోనా పెరుగుతోంది. కాబట్టి ప్రభత్వం వెంటనే చర్యలు చేపట్టాలి'' అని భట్టి డిమాండ్ చేశారు.

Latest Videos

click me!