అసెంబ్లీలోనే ఎంఐఎం ఎమ్మెల్యేలకు కంటి పరీక్షలు... దగ్గరుండి చేయించిన మంత్రి హరీష్

First Published Feb 8, 2023, 1:17 PM IST

తెలంగాణ ప్రజలకేే కాదు ఎమ్మెల్యేలకు కంటి పరీక్షలు చేయించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటుచేసి అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

kanti velugu

హైదరాబాద్ : 'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అనే సామెత మనిషి శరీరంలో కళ్లు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. కేసీఆర్ సర్కార్ కూడా మనిషికి చూపు ఎంత ముఖ్యమో గుర్తించి తెలంగాణ ప్రజలకు కంటిచూపు సమస్య లేకుండా చేయాలని నిర్ణయించి బృహత్తర పథకానికి రూపకల్పన చేసింది. కంటి వెలుగు పేరుతో తెలంగాణలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించడమే కాదు వైద్య సదుపాయం, కళ్లజోళ్లు పంపిణీ చేపట్టింది.  

kanti velugu

కంటి వెలుగు మొదటిదశను విజయవంతంగా పూర్తిచేసిన తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే కంటి వెలుగు రెండో దశను ప్రారంభించింది. కేరళ, పంజాబ్, డిల్లీ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, భగవంత్ మన్, కేజ్రీవాల్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలో కంటివెలుగు రెండో దశను ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కంటి పరీక్షలు కొనసాగతున్నాయి. 
 

kanti velugu

తాజాగా తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించింది కేసీఆర్ సర్కార్. రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి మంత్రి హరీష్ రావు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలతో కలిసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. 
 

kanti velugu

ఇలా అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరంలోనే స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా, మంత్రి ఎర్రబెల్లి తదితరులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కంటి పరీక్షలు చేయించున్నారు. 
 

kanti velugu

ఇక మంత్రి హరీష్ రావు స్వయంగా ఎంఐఎం ఎమ్మెల్యేలను కంటి వెలుగు శిబిరానికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, పాషా ఖాద్రి, ముంతాజ్ ఖాన్ లు కంటి పరీక్షలు చేయించుకున్నారు. 
 

kanti velugu

కంటి వెలుగు కార్యక్రమం గురించి అక్బరుద్దిన్ కు మంత్రి హరీష్ వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలకు మరీ ముఖ్యంగా వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు మేలు జరుగుతోందని హరీష్ తెలిపారు. 

kanti velugu

కంటివెలుగు ప్రాముఖ్యతను ఎంఐఎం ఎమ్మెల్యేలకు మంత్రి హరీష్ వివరించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా ఉందని... దీని ద్వారా పేద ప్రజలకు ఎంతో లబ్ది కలిగించే అవకాశం ఉందని ఎంఐఎం ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. 

kanti velugu

రాష్ట్ర ప్రజలకే కాదు ఎమ్మెల్యేల కోసం అసెంబ్లీలో కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటుచేయడం గొప్పవిషయమని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంఐఎం ఎమ్మెల్యేలు అభినందించారు. 

kanti velugu

ఇలా అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను స్వయంగా మంత్రి హరీష్ దగ్గరుండి కంటి వెలుగు శిబిరానికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే పరీక్షలు నిర్వహించే సిబ్బంది కోరిక మేరకు వారితో సరదాగా సెల్ఫీ దిగారు హరీష్ రావు. 

click me!