మారిన కేసీఆర్ వ్యూహం: కేటీఆర్ ప్రమోషన్ డ్రాప్, హరీష్ కు ఊరట

First Published Jun 1, 2019, 1:05 PM IST

హైదరాబాద్: కేంద్రంలో పోషించే పాత్ర ఏమీ లేకపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఏ పార్టీకీ మెజారిటీ రాదని అంచనా వేసుకుని, జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని వేసుకున్న కేసీఆర్ పథకానికి విఘాతం కలిగింది. బిజెపి అనూహ్యమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయన రాష్ట్రానికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

undefined
కేంద్రంలో పరిస్థితిని, లోకసభ ఎన్నికల్లో వైఫల్యాన్ని దృష్టిలో ఉంచుకుని తన వ్యూహాన్ని మార్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా జులైలో మంత్రివర్గాన్ని విస్తరించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. శాసనసభ సమావేశాలను జూలై నెలాఖరు లేదా ఆగస్టులో నిర్వహించాలని ఆయన అనుకుంటున్నారు. దానికి ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు
undefined
లోకసభ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని తన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావును పక్కన పెట్టడానికి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే, లోకసభ ఫలితాలు అంచనాకు తగినట్లు రాకపోవడంతో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
undefined
కేటీఆర్ కు మంత్రి పదవి ఇస్తే, హరీష్ రావుకు కూడా ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేటీఆర్ లోకసభ ఎన్నికల్లో పార్టీని గెలిపించే పూర్తి బాధ్యతలను చేపట్టగా, హరీష్ రావు మెదక్ లోకసభ స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. కరీంనగర్, నిజామాబాద్ లోకసభ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం, మెదక్ అభ్యర్థి భారీ మెజారిటీ రావడంతో హరీష్ రావును పక్కన పెట్టడం సరి కాదనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చినట్లు చెబుతున్నారు.
undefined
తాను కేంద్రంలోకి వెళ్లి కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయాలనే ఆలోచనకు కేసీఆర్ స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే పరిస్థితులు తారుమారయ్యే ప్రమాదం ఉందని ఆయన గ్రహించినట్లు చెబుతున్నారు. అందువల్ల మునుపటి లాగే హరీష్, కేటీఆర్ లకు మంత్రి పదవులు ఇచ్చి తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
undefined
click me!