బీజేపీ వైపు నేతల చూపు: తెలంగాణలోనూ చంద్రబాబుకు దెబ్బ

First Published May 31, 2019, 3:56 PM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను తమ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు  బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. నాలుగు ఎంపీ స్థానాలను తెలంగాణలో గెలుచుకోవడంతో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. ఏపీలో టీడీపీ ఘోరంగా ఓటమి పాలు కావడాన్ని అనుకూలంగా మలుచుకొనేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్క అసెంబ్లీ స్థానానికి పరిమితమైంది.2014 ఎన్నికల్లో బీజేపీకి అసెంబ్లీలో ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక్క ఎంపీ స్థానం దక్కింది.ఆ ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ కలిసి పోటీ చేసింది.
undefined
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఒకే ఒక్క అసెంబ్లీ స్థానానికి పరిమితమైంది. ఐదు మాసాల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది.
undefined
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్,సికింద్రాబాద్ ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది. 2019 ఎన్నికల్లో మోడీ రెండో దఫా భారీ మెజారిటీతో ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గురువారంనాడు మోడీ కేబినెట్‌లో తెలంగాణకు చెందిన జి. కిషన్ రెడ్డికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది.
undefined
2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో టీడీపీ ఘోరంగా దెబ్బతింది. టీడీపీని లక్ష్యంగా చేసుకొని ఆ సమయంలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యూహం ఫలించింది.మెజారిటీ నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరారు.
undefined
2018 ఎన్నికల్లో టీడీపీ కేవలం రెండు ఎమ్మెల్యే స్థానాలను మాత్రమే కైవసం చేసుకొంది. సత్తుపల్లి నుండి విజయం సాధించిన సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. ఆశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాత్రమే టీడీపీలో ఉన్నారు.
undefined
ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. టీడీపీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ స్థానాలను గెలుచుకొంది.
undefined
కిషన్ రెడ్డి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పదవి దక్కింది. తెలంగాణ టీడీపీ నేతలు ఇ. పెద్దిరెడ్డి, చాడా సురేష్ రెడ్డిలు శుక్రవారం నాడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు.
undefined
వీరిద్దరూ కూడ బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది. చాడా సురేష్ రెడ్డి గతంలో హన్మకొండ నుండి ఎంపీగా విజయం సాధించారు. పెద్ది రెడ్డి చంద్రబాబునాయుడు కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.
undefined
టీఆర్ఎస్‌ను ఢీకొట్టే శక్తి బీజేపీకే ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన అసంతృప్తులను తమ వైపుకు తిప్పుకొనేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు బీజేపీలో చేరారు.
undefined
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తాము పరిపాలించేందుకు సిద్దంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అంటూ ఆ పార్టీకి చెందిన కీలక నేత మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.
undefined
కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి పదవి దక్కడంతో తెలంగాణలో బీజేపీలోకి ఇంకా వలసలు పెరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కాషాయ దళం వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది.
undefined
click me!