Rythu Runa Mafi
Rythu Runa Mafi : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది... తెలంగాణ రైతుల రుణాలను మాఫీ చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను నమ్మిన తెలంగాణ ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి అధికారం కట్టబెట్టారు. ఇలా తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని... ఎంత కష్టమైన ఎన్నికల హామీలను నెరవేర్చాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో చేపట్టిన బృహత్తర కార్యక్రమమే రైతు రుణమాఫీ. ఇప్పటికే రెండు విడతల రుణమాఫీని పూర్తిచేసింది ప్రభుత్వం....మూడో విడతతో ఈ ప్రక్రియ ముగియనుంది.
Rythu Runa Mafi
మొదటి విడతలో లక్ష రూపాయలలోపు రైతు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం తాజాగా లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేసింది. ఇలా రెండు విడతల్లో 17 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రూ.12వేల కోట్లకు పైగా నిధులు జమయ్యాయి. ఈ రుణమాఫీ ద్వారా రైతులపై ఆర్థిక భారం తగ్గింది. మూడో విడతలో రెండు లక్షల లోపు రుణాలు మాఫీ కానున్నాయి. దీంతో మరింత మంది రైతులు ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు.
Rythu Runa Mafi
అయితే ఇప్పటివరకు జరిగిన రుణమాఫీ కొందరు రైతులకు వర్తించలేదు. ఏ రైతులకు రుణమాపీ వర్తిస్తుంది... ఎవరికి వర్తించదో విధివిధానాల్లోనే తెలిపింది ప్రభుత్వం. కానీ అర్హత కలిగిన కొందరు రైతులకు కూడా రుణమాఫీ కాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇలా కొందరు సమాచార లోపంతో, మరికొందరు సాంకేతిక కారణాలతో ఆందోళన చెందుతున్నారు.
Rythu Runa Mafi
రుణమాఫీ రాలేదని కంగారుపడుతున్న రైతులు ముందుగా మీ పేరు అధికారులు ప్రకటించన లిస్ట్ లో వుందో లేదో తెలుసుకోవాలి. అర్హుల లిస్ట్ లో మీరు పేరు లేకుంటే అధికారులను... వుంటే బ్యాంక్ అధికారులను సంప్రదించాలి. అసలు రుణమాఫీ లిస్ట్ లో మీ పేరుందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయండి.
Rythu Runa Mafi
తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన వివరాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించింది. ఇందులో రుణమాఫీకి సంబంధించిన అన్ని వివరాలతో పాటు అర్హుల లిస్ట్ ను పెడుతోంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వ రుణమాఫీ వెబ్ సైట్ https://clw.telangana.gov.in/Login.aspx లోని అర్హుల లిస్ట్ లో మీ పేరుందో లేదో చెక్ చేసుకొండి.
Rythu Runa Mafi
రుణమాఫీ అర్హుల లిస్ట్ లో మీ పేరున్నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడకుంటే సాంకేతిక సమస్య వున్నట్లు. ఇలాంటివారు ఏ బ్యాంకులో అయితే రుణం తీసుకున్నారో ఆ బ్యాంకుకు వెళ్లాల్సి వుంటుంది. బ్యాంకు అధికారులను రుణమాఫీ గురించి అడిగితే సమస్య ఏమిటో చెబుతారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకుంటే రుణమాఫీ డబ్బులు అకౌంట్ లో పడతాయి.
Rythu Runa Mafi
రుణమాఫీ అర్హుల జాబితాలో మీ పేరు లేదంటే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. ఈ రుణమాఫీ సమస్యల పరిష్కారానికి ప్రతి మండలకేంద్రంలో ఓ సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేసారు. అక్కడికి వెళ్లి ఎందుకు రుణమాఫీ రాలేదో తెలుసుకోవచ్చు... ఏదయినా సమస్య వుంటే ఇక్కడే పరిష్కార మార్గాన్ని కనుక్కోవచ్చు. రుణమాఫీ సమస్యల పరిష్కారానికి ఐటీ పోర్టల్, సహాక కేంద్రాల ద్వారా వచ్చే ఫిర్యాదులను 30 రోజుల్లోపు పరిష్కరించాలని అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి నెల రోజుల్లో మీ రుణమాఫీపై క్లారిటీ వస్తుంది.