బిజెపి దెబ్బ: హరీష్ రావును అక్కున చేర్చుకున కేసీఆర్

First Published Dec 10, 2020, 8:58 PM IST

తెలంగాణలో బిజెపి తనను ఎదుర్కోడానికి సర్వశక్తులను ఒడ్డుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు నష్టనివారణ చర్యలకు పూనుకున్నట్లు అర్థమవుతోంది

తెలంగాణలో బిజెపి తనను ఎదుర్కోడానికి సర్వశక్తులను ఒడ్డుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు నష్టనివారణ చర్యలకు పూనుకున్నట్లు అర్థమవుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి హరీష్ రావు పేరు మీది నుంచి వెళ్లిపోయి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తన తనయుడు కేటీఆర్ సత్తా చాటుకుంటారని బహుశా కేసీఆర్ భావించి ఉండవచ్చు. అయితే, పరిస్థితి తిరబడుతుందనే విషయం జిహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా రుజువైంది.
undefined
మంత్రి, మేనల్లుడు హరీష్ రావును దూరం పెట్టడం ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. బిజెపి దెబ్బతో కేసీఆర్ మనసు మారిందని అంటున్నారు. సిద్ధిపేట పర్యటనలో హరీష్ రావుకు కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యం ఆ విషయాన్ని తెలియజేస్తోంది. చాలా కాలంగా దూరం పెడుతూ వచ్చిన హరీష్ రావును ఆయన సిద్ధిపేట పర్యనటలో అక్కున చేర్చుకున్నారు.
undefined
హరీష్ రావుతో పెంచుకున్న దూరాన్ని తగ్గించుకోవడానికే కేసీఆర్ సిద్ధిపేట పర్యటన పెట్టుకున్నట్లు భావిస్తున్నారు. సిద్ధిపేట పర్యటనలో హరీష్ రావును అక్కున చేర్చుకున్నారు. హరీష్ రావును ఆలింగనం చేసుకున్నారు. హరీష్ రావు చేసిన ప్రమాణాన్ని సాదరంగా స్వీకరించారు. దాన్ని బట్టి హరీష్ రావులో పేరుకుపోయిన అసంతృప్తిని తొలగించడానికి కేసీఆర్ ప్రయత్నించినట్లు చెబుతున్నారు
undefined
హరీష్ రావు మామగారు కేసీఆర్ కు కాళ్లకు మొక్కారు. కేసీఆర్ దాన్ని ఆదరంగానే స్వీకరించారు. హరీష్ రావును ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. సిద్ధిపేట తనకు ప్రాణమని, ఆ సిద్ధిపేటను ఆణిముత్యంలాంటి హరీష్ రావుకు అప్పగించానని, తన పేరు నిలబెడుతున్నారని కేసీఆర్ ప్రశంసించారు ఇటీవలి కాలంలో హరీష్ రావుతో ఇంత సన్నిహతంగా కేసీఆర్ మెలిగిన సందర్భాలు లేవు.
undefined
నిజానికి, జిహెచ్ఎంస ఎన్నికల్లో దెబ్బ తిన్న తర్వాత కేటీఆర్ ను మాత్రమే కాకుండా హరీష్ రావును కూడా పిలిచారు. వారిద్దరితో కలిసి జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరిపారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హరీష్ రావు చాలా పరిమితమైన పాత్రను పోషించారు ఆ పరిమిత పాత్రలోనూ తన బాధ్యతను నిర్వహించారు.
undefined
click me!