విజయాలతో జోష్:తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌కు బీజేపీ ప్లాన్

First Published Dec 11, 2020, 4:59 PM IST

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను తమ వైపునకు తిప్పుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ కు బీజేపీ తెరతీసింది. 

దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీలో జోష్ ను నింపాయి. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ కు బీజేపీ తెరతీసింది. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలకు బీజేపీ గాలం వేస్తోంది.
undefined
కాంగ్రెస్ పార్టీ నుండి సినీ నటి విజయశాంతి ఇటీవలనే బీజేపీలో చేరింది. మరికొందరు నేతలు కూడ కాంగ్రెస్ ను వీడుతారనే ప్రచారం సాగుతోంది.
undefined
ఉత్తర తెలంగాణతో పాటు పాటు దక్షిణ తెలంగాణకు చెందిన నేతలపై బీజేపీ నాయకత్వం కేంద్రీకరించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ తో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపినట్టుగా బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ ను వీడి చంద్రశేఖర్ బీజేపీలో చేరుతారని సమాచారం.
undefined
చంద్రశేఖర్ తో మాజీ మంత్రి డీకే అరుణ చర్చించినట్టుగా సమాచారం. 2019 ఎంపీ ఎన్నికల్లో పెద్దపల్లి నుండి ఆయన కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
undefined
ఇదే జిల్లాలోని మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని ప్రచారం సాగుతోంది.
undefined
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలపై కూడ బీజేపీ కన్నేసిందనే ప్రచారం కూడ సాగుతోంది.
undefined
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు, మోహన్ తో పాటు మరికొందరు నేతలతో కూడ బీజేపీ నాయకులు టచ్‌లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
undefined
click me!