తెలంగాణలో విజయ్ సంకల్ప్ యాత్రలకు బీజేపీ ప్లాన్: నాలుగు ప్రాంతాల నుండి నలుగురి యాత్ర

First Published | Aug 13, 2023, 3:08 PM IST

తెలంగాణలో విజయ్ సంకల్ప్ యాత్రలకు  బీజేపీ ప్లాన్ చేస్తుంది.  త్వరలో  అసెంబ్లీ ఎన్నికలు రానున్నందున  ఈ యాత్రల ద్వారా తమ పార్టీ అధికారంలోకి వస్తే  ఏం చేయనున్నామో  బీజేపీ నాయకత్వం  ప్రజలకు వివరించనుంది.

తెలంగాణలో విజయ్ సంకల్ప్ యాత్రలకు బీజేపీ ప్లాన్: నాలుగు ప్రాంతాల నుండి నలుగురి యాత్ర

తెలంగాణ రాష్ట్రంలో  విజయ సంకల్ప యాత్రలకు  బీజేపీ ప్లాన్ చేస్తుంది.  నలుగురు కీలక నేతలు ఈ యాత్రలు చేపట్టనున్నారు.  ఈ యాత్రల్లో అవసరమైతే మరో ఇద్దరు నేతలు కూడ పాల్గొనే అవకాశం ఉంది.ఈ  ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో  ఈ యాత్రలకు  బీజేపీ నాయకత్వం వ్యూహా రచన చేస్తుంది.  

తెలంగాణలో విజయ్ సంకల్ప్ యాత్రలకు బీజేపీ ప్లాన్: నాలుగు ప్రాంతాల నుండి నలుగురి యాత్ర

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ లు రాష్ట్రంలోని నాలుగు వైపులా  నుండి  యాత్రలు  చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  అయితే  ఈ యాత్రలకు  మరో ఇద్దరు నేతలు  కూడ నాయకత్వం వహించే అవకాశం లేకపోలేదు.  బీజేపీ ఎంపీ  డాక్టర్ లక్ష్మణ్,  మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడ   మరో రెండు చోట్ల నుండి  యాత్రలను  ప్రారంభించనున్నారు.  
 
తెలంగాణలో విజయ్ సంకల్ప్ యాత్రలకు బీజేపీ ప్లాన్: నాలుగు ప్రాంతాల నుండి నలుగురి యాత్ర

రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి  ఈ యాత్రలు  ప్రారంభం కానున్నాయి. యాత్రల ముగింపును పురస్కరించుకొని భారీ బహిరంగ సభను నిర్వహించేలా  వ్యూహా రచన చేస్తున్నారు.  అయితే  ఈ యాత్రలు ఎప్పటినుండి ప్రారంభించాలనే దానిపై  ఇంకా స్పష్టత రాలేదు.  ఎవరెవరు  ఎక్కడి నుండి యాత్రలు ప్రారంభించాలనే దానిపై  కూడ  ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ యాత్రలపై పార్టీ నాయకత్వం చర్చిస్తుంది. ఈ సమయంలో పాదయాత్రకు సమయం సరిపోనందున  బస్సుల ద్వారా ఈ యాత్రను చేయాలని  బీజేపీ నేతలు భావిస్తున్నారు.అయితే ఈ యాత్ర ఎలా ఉండాలనే దానిపై  ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.ఈ విషయమై  పార్టీ నేతలు  చర్చిస్తున్నారు.
 
తెలంగాణలో విజయ్ సంకల్ప్ యాత్రలకు బీజేపీ ప్లాన్: నాలుగు ప్రాంతాల నుండి నలుగురి యాత్ర

దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ నాయకత్వం  ఫోకస్ పెట్టింది.  ఈ ఏడాది జూలై మొదటి వారంలో  దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీ  అధ్యక్షులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు.  దక్షిణాదిలో పార్టీ విస్తరణ లక్ష్యంగా  ఈ సమావేశం  కొనసాగింది.
 
తెలంగాణలో విజయ్ సంకల్ప్ యాత్రలకు బీజేపీ ప్లాన్: నాలుగు ప్రాంతాల నుండి నలుగురి యాత్ర

ఈ ఏడాది చివర్లో జరిగే  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  అధికారం దక్కించుకోవాలని  కమల దళం  కదనరంగంలోకి దూకుతుంది. ఈ దిశగా  ఆ పార్టీ నాయకత్వం వ్యూహంతో  ముందుకు వెళ్తుంది. దక్షిణాదిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై  బీజేపీ నాయకత్వం  ఫోకస్ పెట్టింది.,ఈ రాష్ట్రాల నుండి మెజార్టీ  పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో  ఆ పార్టీ నాయకత్వం  ముందుకు  వెళ్తుంది. 
 
తెలంగాణలో విజయ్ సంకల్ప్ యాత్రలకు బీజేపీ ప్లాన్: నాలుగు ప్రాంతాల నుండి నలుగురి యాత్ర

2018  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన  ఫలితాలు రాలేదు.  గోషామహల్ తప్ప ఏ స్థానంలో కూడ  బీజేపీ అభ్యర్థులు విజయం సాధించలేదు.  అయితే  2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను దక్కించుకుంది. ఆ తర్వాత  జరిగిన  దుబ్బాక,  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాల్లో విజయం దక్కించుకుంది.  మునుగోడులో  రెండో స్థానంలో నిలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాలుగు స్థానాల నుండి  48 కార్పోరేట్ స్థానాలను కైవసం చేసుకుంది.

తెలంగాణలో విజయ్ సంకల్ప్ యాత్రలకు బీజేపీ ప్లాన్: నాలుగు ప్రాంతాల నుండి నలుగురి యాత్ర

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు  తెలంగాణలో కాంగ్రెస్ కు  ఊతమిచ్చాయి.  బీజేపీకి  ఈ ఫలితాలు కొంత నిరాశను  కల్గించాయి.  కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో చేరికలు పెరిగాయి. అయితే  దీనికి కౌంటర్ గా బీజేపీ కూడ  తమ పార్టీలో వలసలను ప్రోత్సహిస్తుంది.  మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి  రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీలో  చేరికలపై ఫోకస్ పెట్టారు. శ్రావణ మాసంలో  మరికొందరు నేతలు  బీజేపీలో చేరే అవకాశం ఉందని  ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.  ఇప్పటికే  పలు పార్టీల్లోని అసంతృప్త నేతలు తమతో టచ్ లో ఉన్నారని  కాషాయ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు.

Latest Videos

click me!