హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ పాదయాత్ర జోరుగా సాగుతోంది. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు యావత్ భారతదేశాన్ని కాలినడక చుట్టివచ్చేందుకు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ కు చేరుకున్న రాహుల్ ను కలిసేందుకు కాంగ్రెస్ నాయకులే కాదు సాంస్కృతిక కళాకారులు, సామాన్యులు, చిన్నారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా ఇవాళ పోతురాజులు, శివసత్తులు, డప్పు, గిరిజన కళాకారులు కలిసారు. అలాగే బోనాలతో కొందరు మహిళలు, కాంగ్రెస్ జెండాలతో మరికొందరు యువకులు రాహుల్ కు స్వాగతం పలికారు.