1. కిస్మత్ :
అమ్మాయిలకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఆదివారంతో పాటు బుధవారం ఇక్కడ లేడీస్ నైట్ నిర్వహిస్తారు. ఇష్టమైన ఆహారాన్ని రుచిచూస్తే టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు ఇంగ్లీష్ మ్యూజిక్ ను ఎంజాయ్ చేయవచ్చు.
ఖర్చు : ఇద్దరికి సుమారు రూ.2,000 నుండి రూ.3,000
టైమింగ్ : రాత్రి 8 గంటల నుండి 12 గంటల వరకు
అడ్రస్ : ది పార్క్ హోటల్, సోమాజిగూడ
2. 10 డౌనింగ్ స్ట్రీట్ :
హైదరాబాద్ లోని మరో ప్రముఖ పబ్ 10 డౌనింగ్ స్ట్రీట్. ఇంగ్లీష్ కల్చర్ ను ప్రతిబింబించే థీమ్ తో ఈ పబ్ కొనసాగుతుంది. ఇక్కడ యువతీ యువకులు సురక్షితంగా పార్టీని ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో కూడా లేడీస్ నైట్ నిర్వహిస్తుంటారు.
ఖర్చు : ఇద్దరికి సుమారు రూ.2,500 నుండి రూ.3,000
టైమింగ్ : మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు
అడ్రస్ : గచ్చిబౌలి, బేగంపేట్
3.గ్లోకల్ జంక్షన్ :
ఇది లోకల్ టచ్ తో కూడిన గ్లోబల్ సదుపాయాల అందిస్తుంది. మంచి మ్యూజిక్ లో ఫుడ్ ను ఎంజాయ్ చేయవచ్చు. ఔట్ డోరింగ్ సీటింగ్ కూడా వుంది... ఇక్కడ కూర్చుని నగర అందాలను వీక్షిస్తూ ఫుడ్, డ్రింక్ ను ఆస్వాదించవచ్చు.
ఖర్చు : ఇద్దరికి సుమారుగా రూ.1200 నుండి రూ.1500 వరకు ఖర్చు అవుతుంది.
టైమింగ్ : మద్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు
అడ్రస్ : కొండాపూర్