కేశవరావు స్థానంలో డిల్లీ నేత ... కాంగ్రెస్ అదిష్టానం కీలక ప్రకటన

First Published | Aug 14, 2024, 10:01 PM IST

దేశవ్యాప్లంగా 12 రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కేశవరావు స్థానంలో డిల్లీ నేతను బరిలోకి దింపుతోంది కాంగ్రెస్. 

rajyasabha

హైదరాబాద్ : తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్...సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీని బరిలోకి దింపుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కే. కేశవరావు భారత రాష్ట్ర సమితిని వీడి తిరిగి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ ద్వారా పొందిన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసారు. దీంతో తెలంగాణలో ఓ రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది.  

Telangana

తెలంగాణతో సహా వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలు ఖాళీగా వున్నాయి. ఇలా ఖాళీగా వున్న 12 రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్దమయ్యింది. ఇప్పటికే ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలచేసిన ఈసీ సెప్టెంబర్ 3న పోలింగ్ చేపట్టనుంది.

Latest Videos


Piyush Goyal

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు పోటీచేసి గెలిచారు. ఇలా పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా కామఖ్య ప్రసాద్, మీసా భారతి,వివేక్ ఠాకూర్,  దీపేంద్రసింగ్ హుడా, ఉదయన్ రాజే బోస్లే, కేసి వేణఉగోపాల్, బిప్లబ్ కుమార్ దేబ్ లోక్ సభకు ఎన్నికయ్యారు. దీంతో వారి రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. 
 

keshav rao

ఇక తెలంగాణకు చెందిన కేశవరావు బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరి రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసారు. అలాగే ఒడిషాకు చెందిన మరో ఎంప మమతా మొహంత కూడా బిజెడి పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 

Congress Party

అయితే కాంగ్రెస్ లో చేరినవెంటనే కేశవరావును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది రేవంత్ సర్కార్. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీని పోటీలో దింపుతోంది కాంగ్రెస్.  ఆయన పేరును ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ప్రకటించారు. 

click me!