ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక జరగనుంది.ఈ ఎన్నిక కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.ఈ ఎన్నిక జరగాలంటే కోరం కోసం 97 మంది సభ్యులు అవసరమౌతారు.

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకం కానున్నాయి. నగర ఓటర్లు ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీని కట్టబెట్టలేదు.

వివిధ నియోజకవర్గాల నుండి వివిధ కోటాల ఎన్నికైన ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఎక్స్ అఫిషియో సభ్యులుగా పేర్లు నమోదు చేసుకొన్నారు.

సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, ఫరీదుద్దీన్, గోరటి వెంకన్న తదితరులున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటరు జాబితాలో పేరు ఉండడంతో వారు జీహెచ్ఎంసీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా మేయర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులేనని అధికారులు తేల్చి చెప్పారు.

గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లాల నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కొందరు ప్రస్తుత మేయర్ ఎన్నికకు ఓటర్లుగా లేరు. ఎందుకంటే ఇప్పటికే ఇతర మున్సిపాలిటీ, కార్పోరేషన్లలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు వినియోగించుకోవడంతో ఇక్కడ అర్హత లేకుండాపోయింది.

పదవీకాలంలో ఎక్కడైనా ఒక్కచోట మేయర్, డిప్యూటీ మేయర్ లను ఎన్నుకొనేందుకు అవకాశం ఉంటుంది.

టీఆర్ఎస్ కు నామినేటేడ్ పదవులతో కలిపి 32 మంది సభ్యుల బలం ఉంటుంది. రెండు రోజుల ముందు ఇది 33గా ఉంది.ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు ఉంటే వారికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎక్స్ అఫిషియో సభ్యుల బలం 32కి పరిమితమైంది.

జీహెచ్ఎంసీ ఎన్నిక కోసం 97 మంది సభ్యులతో కోరం ఉండాల్సిందే. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాలంటే మొత్తం కార్పోరేటర్లలో సగం మంది హాజరు కావాల్సిందే. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 కార్పోరేటర్లలో ప్రమాణ స్వీకారానికి ముందే లింగోజిగూడ డివిజన్ కార్పోరేటర్ రమేష్ గౌడ్ మరణించాడు.

దీంతో ప్రస్తుతం కార్పోరేటర్ల సంఖ్య 149 మాత్రమే. ఎక్స్ అఫిషియో సభ్యులు 44 మంది. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 193గా ఉంటుంది. ఇందులో సగం మంది ఈ ఎన్నిక నిర్వహణ సమయంలో ఉండాల్సిందే.

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి వేరే చోట ఓటు హక్కు ఉంది. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకొనే పరిస్థితి లేదు.

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం ఉంటుంది.

బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇతర మున్సిపాలిటీలో ఓటు వినియోగించుకొన్నారు. దీంతో జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం లేదు.

జీహెచ్ఎంసీ ఎక్స్‌అఫిషియో కోసం 44 మంది ఉన్నట్టుగా తేల్చినట్టుగా సమాచారం. ఇందులో టీఆర్ఎస్ కు 32 మంది ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కును నమోదు చేసుకొన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యుల సంఖ్యతో కలిపి టీఆర్ఎస్ కు మొత్తం 88 మంది సభ్యులుంటారు.