కవితకు డీఎస్ దెబ్బ: నిజామాబాద్‌లో ఘోర ఓటమి

First Published May 23, 2019, 6:05 PM IST

నిజామాబాద్‌ ఎంపీ స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఓటమి పాలైంది. బీజేపీ అభ్యర్ధి.. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ  టీఆర్ఎస్ నేత  ధర్మపురి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి 2014 ఎన్నికల్లో తొలిసారిగా కవిత పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కవిత మరోసారి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఈ దఫా కాంగ్రెస్ అభ్యర్ధి మధు యాష్కీ, బీజేపీ అభ్యర్ధిగా ధర్మపురి అరవింద్ పోటీ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎర్రజొన్న, పసుపు రైతులు ఆందోళన చేశారు.
undefined
తమ డిమాండ్లను దేశం దృష్టికి తీసుకొచ్చేందుకు గాను పసుపు, ఎర్రజొన్న రైతులు నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. 178 మంది రైతులు ఈ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేశారు . ఈ పార్లమెంట్ స్థానంలో `185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
undefined
నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను నామినేషన్లను ఉపసంహరించేందుకు టీఆర్ఎస్ నేతలు తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. కానీ, రైతులు మాత్రం నామినేషన్లను ఉప సంహరించుకోలేదు.
undefined
కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్‌లో చేరిన డి.శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని నిజామాబాద్ జిల్లాకు చెందిన పార్టీ నేతలు ఆయనపై ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను డీఎస్ ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎస్ టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని భావించారు. కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు.
undefined
డి.శ్రీనివాస్ తనయుడు సంజయ్‌...... నర్సింగ్ కాలేజీ విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని కేసు నమోదైంది. ఈ కేసులో సంజయ్ అరెస్టయ్యారు. తమ కుటుంబాన్ని వేధింపులకు గురి చేశారని డీఎస్ టీఆర్ఎస్‌పై ఆరోపణలు చేశారు.
undefined
ఈ దఫా ఎన్నికల్లో డీఎస్ తనయుడు అరవింద్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఇదే స్థానంలో వై. లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ ఎన్నికల సమయంలో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.
undefined
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేసింది. రైతులతో నామినేషన్లు దాఖలు చేయడం వెనుక కూడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల హస్తం ఉందని టీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు చేశారు.
undefined
ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధి అరవింద్ విజయం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేసిందని టీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో నిజామాబాద్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వై. లక్ష్మీనారాయణ గెలుపు కోసం కేసీఆర్ ప్రచారం కూడ నిర్వహించిన విషయం తెలిసిందే.
undefined
నిజామాబాద్ ఎంపీ స్థానంలో కూతురు కవిత గెలుపు కోసం టీడీపీకి చెందిన సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావును కూడ టీఆర్ఎస్‌లో చేర్చుకొన్నారు. అయినా టీఆర్ఎస్‌కు ఫలితం దక్కలేదు.
undefined
click me!