స్మార్ట్ కాలింగ్ ఫీచర్‌తో జీబ్రోనిక్స్ కొత్ స్మార్ట్‌వాచ్.. అల్ ఇన్ ఫీచర్స్ తో తక్కువ ధరకే..

First Published | Jun 17, 2021, 3:48 PM IST

 ఎలక్ట్రానిక్ కంపెనీ జిబ్రోనిక్స్  కొత్త స్మార్ట్‌వాచ్  జీబ్రోనిక్స్ జెడ్-ఫిట్ 4220సి‌హెచ్ ని భారత మార్కెట్లో విడుదల చేసింది. జిబ్రోనిక్స్  ZEB-FIT4220CH స్మార్ట్‌వాచ్ గురించి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనికి కాలింగ్ ఫీచర్ అందించారు అంటే మీరు మీ ఫోన్‌కు బదులుగా స్మార్ట్‌వాచ్ నుండి కాల్స్ మాట్లాడవచ్చు. 

ఈ స్మార్ట్ వాచ్ లో కాల్ చేయడానికి మైక్ అండ్ స్పీకర్ ఇచ్చారు. జీబ్రోనిక్స్ జేబ్-ఫిట్4220సి‌హెచ్ అనేక హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో కూడా వస్తుంది. దీనిలో SpO2సెన్సార్, బ్లడ్ ప్రేజర్ మానిటర్ వాటి మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. జీబ్రోనిక్స్ ZEB-FIT4220CHధర రూ.3,999. దీనిని అమెజాన్ ఇండియా ద్వారా విక్రయించనున్నారు. ఈ స్మార్ట్‌వాచ్ బ్లాక్, సిల్వర్ అండ్ క్యాడెట్ అనే మూడు రంగులలో లభిస్తుంది.
జీబ్రోనిక్స్ ZEB-FIT4220CH ఫీచర్లుజీబ్రోనిక్స్ జేబ్-ఫిట్4220సి‌హెచ్ స్మార్ట్‌వాచ్ 1.2-అంగుళాల ఫుల్ టచ్ టి‌ఎఫ్‌టి కలర్ డిస్‌ప్లేతో వస్తుంది. అంతేకాకుండా దీనికి ఇంటర్నల్ మైక్ అండ్ స్పీకర్‌ సపోర్ట్ కూడా ఉంది. వాచ్‌లో ఫ్హోన్ కాల్స్ రిజెక్ట్ చ్సే ఆప్షన్ కూడా ఉంటుంది. రీసెంట్ కాల్స్, కాంటాక్ట్స్, డయల్‌ప్యాడ్ కూడా అందుబాటులో ఉంటాయి. దీని ప్రయోజనం ఏమిటంటే కాల్స్ చేసేటప్పుడు నంబర్‌ను డయల్ చేయడంలో ఎటువంటి సమస్య ఉండదు.

జీబ్రోనిక్స్ జేబ్-ఫిట్4220సి‌హెచ్ లో వాకింగ్, రన్నింగ్, స్కిప్పింగ్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్‌తో సహా ఏడు స్పోర్ట్స్ మోడ్‌లు లభిస్తాయి. బ్లడ్ ప్రేజర్ మానిటర్, హార్ట్ బబీట్ సెన్సార్ రేటు, SpO2 సెన్సార్ తో పాటు ఈ స్మార్ట్‌వాచ్ లో స్లీప్ ట్రాకింగ్, స్టెప్ కౌంటర్ , క్యాలరీ బర్న్ ట్రాకర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
జీబ్రోనిక్స్ నుండి వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ లో 100పైగా కస్టమైజ్ వాచ్ ఫెసెస్ ఉన్నాయి. దీనికి వాటర్ రిసిస్టంట్ కోసం ఐ‌పి67 రేటింగ్‌ను పొందింది. ఈ జీబ్రోనిక్స్ స్మార్ట్ వాచ్ తో మీరు ఫోన్ కెమెరాను ఓపెన్ చేయవచ్చు ఇంకా మ్యూజిక్ కంట్రోల్ చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ అండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ రెండు స్మార్ట్ ఫోన్లకు కనెక్ట్ చేసుకొని ఉపయోగించవచ్చు. దీనికి 220mAh బ్యాటరీ అందించారు అలాగే ఇది 30 రోజుల స్టాండ్ బై ఇస్తుంది.

Latest Videos

click me!