Xiaomi Pad 5: మీరు ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ లేదా ఐప్యాడ్ కొనాలనుకుంటున్నారా.. అయితే దీని గురించి తెలుసుకోండి..

First Published | May 20, 2022, 4:36 PM IST

ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షియోమీ (Xiaomi) ప్యాడ్ 5  ఇండియాలో దాని ధర కారణంగా చాలా మందిని ఆకర్షిస్తుంది.  షియోమీ ప్యాడ్ 5 రూ. 26,999 ప్రారంభ ధరతో ఆండ్రాయిడ్ టాబ్లెట్ డాల్బీ విజన్‌ 120Hz LCD డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్‌తో క్వాడ్ స్పీకర్‌లు, ప్యాడ్ కోసం కస్టమైజేడ్ MIUI 13, స్నాప్‌డ్రాగన్ 860 SoCతో వస్తుంది, ఇంకా హెవీ  ట్యాస్క్ చేయచగలదు.

 అంతేకాకుండా, Xiaomi ప్రొప్రైటరీ అసెసోరిఎస్ ఆప్షన్ అందించడమే కాకుండా, మొత్తం అనుభవాన్ని మెరుగుపరచడానికి కస్టమర్‌లు థర్డ్-పార్టీ కీబోర్డ్‌లు, గేమ్‌ప్యాడ్‌లను కూడా కనెక్ట్ చేయవచ్చు. ఇంకా మీరు వీడియో కాలింగ్ కోసం టాబ్లెట్‌ను ఉపయోగించాలనుకుంటే ముందు, వెనుక భాగంలో  కాపాబుల్ కెమెరాలను పొందవచ్చు.

Xiaomi ప్యాడ్ 5లో 256GB స్టోరేజ్‌ వేరియంట్‌ కూడా ఉంది, దీని ధర రూ. 28,999.  అంటే రూ. 30,990 ఖరీదు చేసే iPad 9th-Gen 64GB కంటే సరసమైనది. ప్రోడక్ట్ బ్రీఫింగ్ సెషన్‌లో కంపెనీ  కొత్త-జెన్ టాబ్లెట్ చాలా అవసరాలను తీరుస్తుందని పేర్కొంది, గేమింగ్, ప్రోడుక్టివిటీ, వినోదం ఇంకేదైనా. 

ఎంటర్టైన్మెంట్ కోసం Xiaomi Pad 5 :  ల్యాప్‌టాప్ కంటే సన్నగా ఉండే ఫారమ్ ఫ్యాక్టర్‌ను పొందడం వల్ల కంటెంట్‌ని వీక్షించడానికి టాబ్లెట్‌లు గొప్పగా ఉంటాయి. ఎన్నో బడ్జెట్ టాబ్లెట్‌లు పూర్తి-HD లేదా అంతకంటే ఎక్కువ రిజల్యూషన్‌ అందిస్తుందని చేసినప్పటికీ, హై-రిజల్యూషన్ వీడియోలను అన్‌లాక్ చేయడానికి వాటికి అత్యంత స్టాండర్డ్ Android కీ లేదు. కాబట్టి ముందుగా OTT ప్లాట్‌ఫారమ్‌ల కోసం L1 వైడ్‌వైన్ సర్టిఫికేషన్‌ను పొందుతాము, అంటే నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలు పూర్తి-HD లేదా Ultra-HD రిజల్యూషన్‌లో ప్లే అవుతాయి.

 WQHD+ (1,600 x 2,560 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో 10.95-అంగుళాల LCD డిస్‌ప్లేను పొందుతుంది. స్మూత్ స్క్రోలింగ్, బ్రౌజింగ్ అనుభవం కోసం ఆపిల్  'ప్రో' ఐప్యాడ్ సిరీస్ కోసం  120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను అందించింది. మీ వినోద అనుభవాన్ని మరింత పెంచడానికి బాస్ అండ్ లౌడ్‌నెస్‌ను అందించే క్వాడ్-స్పీకర్ సిస్టమ్ ఉంది.  

అదేవిధంగా, చదవడాన్ని ఆస్వాదించే వినియోగదారులు ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 13 ఉన్న 'రీడింగ్ మోడ్'  బెనెఫిట్స్ పొందవచ్చు.  


Xiaomi Pad 5లో 3.5mm ఆడియో జాక్‌ లేదు, ఇది ఇప్పటికీ వైర్డు ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించడానికి  ఇష్టపడే కొంతమంది వినియోగదారులను నిరాశపరచవచ్చు. టాబ్లెట్‌లో LTE వేరియంట్  లేదు  కాబట్టి మీరు డివైజ్ ఎక్కడైనా బయట ఉపయోగించాలనుకుంటే, పబ్లిక్ Wi-Fi కనెక్షన్‌ని ఉపయోగించకుండా  మీరు ఫోన్ హాట్‌స్పాట్‌పై ఆధారపడాలి. చివరగా, LCD ప్యానెల్‌ను ఉపయోగించాలనే Xiaomi నిర్ణయాన్ని కూడా కొందరు ప్రశ్నించవచ్చు, కానీ  హై రిజల్యూషన్, డాల్బీ విజన్,  బ్రైట్ నెస్ కారణంగా చాలా మంది యూజర్లు  తేడాను కూడా గుర్తించలేరు.
 


గేమింగ్ కోసం Xiaomi Pad 5 : Xiaomi Pad 5 గేమింగ్ కోసం ఉపయోగించవచ్చు, ప్రధానంగా  డిస్‌ప్లే అండ్ ప్రాసెసర్ కారణంగా.  OTG సప్పోర్ట్ తో USB-C పోర్ట్‌ కూడా ఉంది, కాబట్టి మీరు థర్డ్ పార్టీ గేమ్‌ప్యాడ్‌లను కనెక్ట్ చేయవచ్చు. గేమ్‌ప్యాడ్ లో అస్ఫాల్ట్ 9ని ప్లే కూడా అతితక్కువ లాగ్ తో పనిచేస్తుంది.


  Geekbench  సింగిల్-కోర్ అండ్ మల్టీ-కోర్ CPU పరీక్షలో Xiaomi Pad 5 760 అండ్ 2,526 పాయింట్లను స్కోర్ చేసింది. 3D మార్క్ 1-మినట్  లాంగ్ వైల్డ్‌లైఫ్ GPU పరీక్షలో, టాబ్లెట్ 3,265 పాయింట్‌లను సాధించింది. చివరగా, దాని CPU గరిష్ట పనితీరులో 95 శాతానికి చేరుకుంది. స్కోర్‌లు Xiaomi ప్యాడ్ 5 దాని బడ్జెట్ ఆండ్రాయిడ్ పోటీల కంటే మెరుగ్గా పని చేస్తుందని సూచిస్తున్నాయి.


దీని యూజర్ ఇంటర్‌ఫేస్ చాలావరకు సహజమైనది ఇంకా వృద్ధ కస్టమర్‌లు కూడా టాబ్లెట్‌ని సులభంగా ఆపరేట్ చేయగలరు. యూజర్లు Instagram, Facebook వంటి యాప్‌లను కూడా ఉపయోగించవచ్చు.
 

మీరు వీడియో కాల్‌లపై ఆధారపడే టీచర్ లేదా ప్రొఫెషనల్ అయితే, ఫ్రంట్ కెమెరా ఖచ్చితమైన లైటింగ్ పరిస్థితుల్లో ఆవరేజ్ కంటే ఎక్కువ పనితీరును అందిస్తుంది. ఊహించినట్లుగానే లో లైట్ సెట్టింగ్‌లలో ఫోటోలు, వీడియోలు గ్రెనీగా ఉంటాయి. మరోవైపు, 13-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా షార్ప్ ఫోటోలను అందిస్తుంది ఇంకా Galaxy Tab A8, Nokia T20 వంటి బడ్జెట్ టాబ్లెట్‌ల కంటే మెరుగ్గా పని చేస్తుంది.

అయితే, Xiaomi Tab 5 అనేది ల్యాప్‌టాప్ కాదని,  ప్రధానంగా వినోద ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుందని గుర్తుంచుకోవాలి.  

అసెసోరిస్  : Xiaomi ప్యాడ్ 5 కీబోర్డ్ లేదా స్టైలస్ వంటి  అసెసోరిస్  పొందదు. కస్టమర్‌లు వాటిని విడిగా కొనుగోలు చేయాలి. Xiaomi Pad 5 కవర్‌ ధర రూ. 1,999, ఇది గీతలు పడకుండా రక్షించడంలో సహాయపడుతుంది.  వినియోగదారులకు సౌకర్యవంతమైన వ్యూ కోణం కోసం టాబ్లెట్‌ను మౌంట్ చేయడానికి కూడా సహాయపడుతుంది.

Latest Videos

click me!