రెండవ లెన్స్ 8-మెగాపిక్సెల్ సోనీ IMX355 అల్ట్రా-వైడ్ సెన్సార్. మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్. సెల్ఫీ కోసం 32-మెగాపిక్సెల్ సోనీ IMX615 సెన్సార్ ఉంది. ఫోన్ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 4500mAh బ్యాటరీ ఇచ్చారు. కనెక్టివిటీ కోసం, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, NFCతో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
వన్ ప్లస్ నార్డ్ సిఈ 2 లైట్ 5G స్పెసిఫికేషన్‌లు
వన్ ప్లస్ నార్డ్ సిఈ 2 లైట్ 5Gలో ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్OS 12.1 ఉంది. అంతేకాకుండా, ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. దాని మీద గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో 6జిబి వరకు LPDDR4X ర్యామ్, 128జిబి స్టోరేజ్ తో పనిచేస్తుంది.