నెట్‌ఫ్లిక్స్ మూవీస్, షోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా.. అయితే ఈ విధంగా చేయండి..

First Published | May 31, 2021, 7:16 PM IST

అమెరికన్ ఓ‌టి‌టి ఫ్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ నేడు ఇండియాలో ఆన్-డిమాండ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా మారింది. మీలో చాలామంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు ఉండే ఉంటారు. అయితే నెట్‌ఫ్లిక్స్ నుండి షోలు, సినిమాలు లేదా వీడియోలను డౌన్‌లోడ్ చేయడం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా ఆలోచించిన మీకు మార్గం ఉండకపోవచ్చు. 

ఇప్పుడు కంపెనీ ఈ ఇబ్బందిని తొలగించింది. నెట్‌ఫ్లిక్స్ యాప్ కొత్త అప్ డేట్ తో డౌన్‌లోడ్ చేసే ఆప్షన్ విడుదల చేసింది, అయితే ఈ డౌన్‌లోడ్ ఆఫ్‌లైన్ వీక్షణ కోసం మాత్రమే ఉంటుంది కానీ ఎవరితోనూ భాగస్వామ్యం చేయలేరు, అంటే నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఇన్ యాప్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఇచ్చింది. కాబట్టి దీని గురించి తెలుసుకుందాం...
undefined
ఆఫ్‌లైన్‌లో చూడటానికి నెట్‌ఫ్లిక్స్ వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలిమొదటి విషయం ఏమిటంటే మీ నెట్‌ఫ్లిక్స్ యాప్ అప్ డేట్ చేయడం తద్వారా మీరు యాప్ కొత్త వెర్షన్ పొందుతారు. యాప్ అప్ డేట్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేయదలిచిన సినిమా, వెబ్ షోలు లేదా టీవీ షోల కోసం సెర్చ్ చేయండి అయితే కొన్ని వీడియోలకు మీకు డౌన్‌లోడ్ చేసే అవకాశం లభించదు.
undefined

Latest Videos


మీకు ఇష్టమైన షోల పై క్లిక్ చేసిన తరువాత కింద మై డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, ఇది ప్లే బటన్ పక్కన ఉంటుంది. విండోస్ 10లో డౌన్‌లోడ్ చేయడానికి మీరు మెనూ బార్‌కు వెళ్లాలి. డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత వీడియో డౌన్‌లోడ్ అవుతుంది, తరువాత మీరు ఇంటర్నెట్ లేకపోయినా వీటిని చూడవచ్చు. మీరు మెను బార్‌కు వెళ్లడం ద్వారా డౌన్‌లోడ్ లిస్ట్ కూడా చూడవచ్చు.
undefined
డౌన్‌లోడ్ చేసిన వీడియోలు నిర్ణీత సమయం తర్వాత స్వయంచాలకంగా తొలగిపోతాయి. మీకు కావాలంటే, మీరు వీడియోలను చూసిన తర్వాత తొలగించవచ్చు, తద్వారా ఇతర వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడానికి స్థలం ఉంటుంది.
undefined
click me!