జియో చౌకైన ప్లాన్ తీరిగి వచ్చేసింది.. ఇప్పుడు ఇన్ కమింగ్ అవసరమైన వారికి బెస్ట్ ప్లాన్ ఇదే..

First Published Jun 1, 2021, 4:52 PM IST

రిలయన్స్ జియో గత ఏడాది మే నెలలో పాపులర్ ప్రీ-పెయిడ్ ప్లాన్లలో ఒకదాన్ని నిలిపివేసింది. తరువాత చాలా మంది వినియోగదారులు వేరే ప్లాన్ కి మరాల్సి వచ్చింది.  సరిగ్గా అంటే లాక్ డౌన్ మధ్య జియో గత సంవత్సరం రూ .98 ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను తొలగించింది, కానీ ఇప్పుడు మళ్ళీ జియో రూ .98 ప్లాన్ తిరిగి ప్రవేశపెట్టింది. 

ఈ రూ .98 ప్లాన్ గతంలో చాలా ప్రజాదరణ పొందింది, ఎందుకంటే ఈ ప్లాన్ సంస్థ చౌకైన 28 రోజుల వాలిడిటీగల ప్రీ-పెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ తిరిగి రావడంతో జియో రూ.129 ప్లాన్‌ను నిలిపివేసింది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్ తో మొత్తం 2 జిబి డేటా అందుబాటులో ఉంది అలాగే అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఇక ఈ రూ .129 ప్లాన్ జియో వెబ్‌సైట్‌లో చూడలేము. అయితే రూ .98 ప్లాన్ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
undefined
ప్రతినెల ఇన్ కమింగ్ అవసరమైన వారికి జియో రూ .98 ప్లాన్ ఒక మంచి బహుమతి. ఈ ప్లాన్ నిలిపివేసిన తరువాత చాలా మంది వినియోగదారులు రూ .129 రీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితిలో ఈ ప్లాన్ తిరిగి రావడం వినియోగదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.
undefined
జియో రూ .98 ప్లాన్‌తో ఇప్పుడు 14 రోజుల వాలిడిటీ లభిస్తుండగా, అంతకుముందు ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ అందించింది. అంతేకాకుండా, అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రతిరోజూ 1.5 జీబీ డేటా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ తో ఎస్‌ఎం‌ఎస్ సౌకర్యం లభించదు. మీరు ఈ ప్లాన్ ని జియో వెబ్‌సైట్ లేదా మై జియో యాప్ లో చూడవచ్చు.
undefined
ఇప్పుడు జియోలో రోజుకు 1 జీబీ డేటాతో రూ.149 చౌకైన ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ తో ప్రతిరోజూ 1 జిబి డేటా 24 రోజులు వాలిడిటీ వస్తుంది. అలాగే అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజు 100 ఎస్‌ఎంఎస్ లు, జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.
undefined
మీరు 28 రోజుల వాలిడిటీతో డైలీ డాటా ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే జియోలో రూ. 199 ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ ఇతర ప్లాన్స్ లాగానే అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో జియో యాప్స్‌కు సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తోంది.
undefined
click me!