Xiaomi 18 Pro : జియోమీ నుండి ఏకంగా 200 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్.. టాప్ క్లాస్ ఫీచర్స్ తో మార్కెట్ షేక్

Published : Nov 10, 2026, 05:29 PM IST

Xiaomi 18 Pro Smartphone : జియోమీ 18 ప్రో స్మార్ట్‌ఫోన్ డిసెంబర్‌లో ఇండియాలో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. దీనితో పాటే జియోమీ 18T మోడల్ స్పెసిఫికేషన్స్ కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

PREV
15
షియోమీ 18T & 18 ప్రో ఎప్పుడు రిలీజ్?

Xiaomi 18 Pro Smartphone : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టాప్ బ్రాండ్ అయిన షియోమీ, తన కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌తో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించింది. చైనాలో షియోమీ 18 ప్రో, షియోమీ 18 ప్రో మ్యాక్స్‌లను లాంచ్ చేసిన తర్వాత, ఇండియాలో కూడా ఈ సిరీస్‌ను తీసుకువస్తున్నట్లు టీజర్ వదిలింది. కానీ ఇండియాలో కచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఈ నేపథ్యంలో షియోమీ 18 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇండియాలో ఎప్పుడు సేల్‌కు వస్తుందనే సమాచారం ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం… డిసెంబర్‌లో ఈ మోడల్ ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు షియోమీ 18T అనే మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకురావడానికి షియోమీ రెడీ అవుతోందని టాక్.

ముఖ్యంగా షియోమీ 18T మోడల్‌లో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, 165Hz లేదా 185Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే లాంటి ఫీచర్లు ఉంటాయన్న వార్త స్మార్ట్‌ఫోన్ లవర్స్‌లో భారీ అంచనాలను పెంచేసింది. ఇవన్నీ లీక్‌ల ఆధారంగా వస్తున్న వార్తలు కాబట్టి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు కన్ఫర్మ్ చేసుకోలేం.

25
షియోమీ 18 ప్రో డిసెంబర్‌లో వస్తోందా?

షియోమీ 18 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇండియాలో డిసెంబర్ నెలలో లాంచ్ కావొచ్చని తెలుస్తోంది. షియోమీ ప్రో సిరీస్ ఫోన్ల కోసం వెయిట్ చేస్తున్న వాళ్లకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఎందుకంటే దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత కంపెనీ నుంచి ఒక ప్రో మోడల్ ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది.

చివరిసారిగా షియోమీ 13 ప్రో స్మార్ట్‌ఫోన్ 2023 ఫిబ్రవరిలో ఇండియాలో లాంచ్ అయింది. ఆ తర్వాత ఇండియన్ మార్కెట్ కోసం షియోమీ తన ప్రొడక్ట్ స్ట్రాటజీని మార్చేసింది. బేసిక్ మోడల్స్, హై-ఎండ్ అల్ట్రా మోడల్స్‌పై ఫోకస్ పెట్టిన కంపెనీ, ప్రో మోడల్స్‌ను ఇండియాలో లాంచ్ చేయలేదు. ఇప్పుడు షియోమీ 18 ప్రో ఇండియాకు వస్తుందనే వార్త కొత్త అంచనాలను క్రియేట్ చేసింది. ఈ మోడల్ లాంచ్ అయితే ఇండియాలో షియోమీ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ల లైనప్‌లో మళ్లీ ప్రో మోడల్‌కు చోటు దక్కుతుంది.

35
షియోమీ 18T స్పెసిఫికేషన్స్ ఇవేనా?

షియోమీ 18 ప్రో డీటెయిల్స్‌తో పాటు, షియోమీ 18T స్మార్ట్‌ఫోన్ ముఖ్యమైన ఫీచర్లు కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ మోడల్‌లో 1.5K రెజల్యూషన్‌తో కూడిన LTPS OLED డిస్‌ప్లే ఉండొచ్చని సమాచారం. అలాగే 165Hz లేదా 185Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా ఇవ్వొచ్చని తెలుస్తోంది. పెర్ఫార్మెన్స్ కోసం MediaTek Dimensity 8600 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను వాడే అవకాశం ఉంది. దీనికి తోడు LPDDR5x RAM, UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీ కూడా ఉండొచ్చు.

కెమెరా విషయానికొస్తే… Leica బ్రాండింగ్‌తో ట్యూన్ చేసిన 3 రియర్ కెమెరాల సెటప్ ఉంటుందని టాక్. ఇందులో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉండొచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వొచ్చని వార్తలు వస్తున్నాయి.

సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే Android 17 ఆధారిత Xiaomi HyperOS 4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రావొచ్చని భావిస్తున్నారు. అంతేకాదు దుమ్ము, నీటి నుంచి రక్షణ కల్పించే IP69 రేటింగ్ కూడా షియోమీ 18T మోడల్‌లో ఉండొచ్చని లీకైన సమాచారం చెబుతోంది. అయితే, ఈ ఫీచర్లలో దేన్నీ షియోమీ ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు.

45
Xiaomi 18 Pro-లో ఫీచర్లు ఏమున్నాయి?

చైనాలో సెప్టెంబర్ 23న Xiaomi 18 Pro లాంచ్ అయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో కూడా లాంచ్ చేయడానికి కంపెనీ టీజర్ వదిలింది. ఈ మోడల్‌లో 6.4 అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లే ఉంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1,120 x 2,436 పిక్సెల్స్. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, గరిష్ఠంగా 4,000 నిట్స్ బ్రైట్‌నెస్ లాంటి అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.

పెర్ఫార్మెన్స్ కోసం ఆక్టా-కోర్ Snapdragon 8 Elite Gen 6 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఫోన్ వెనుక వైపు అదనంగా 2.7 అంగుళాల AMOLED సెకండరీ డిస్‌ప్లే కూడా ఉంది. దీని రిజల్యూషన్ 596 x 912 పిక్సెల్స్. బ్యాటరీ విషయానికొస్తే, 7,000mAh కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఇచ్చారు. ఎక్కువ సేపు ఫోన్ వాడే వారికి ఈ మోడల్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది.

55
షియోమీ 18T & 18 ప్రో ఎప్పుడు రిలీజ్?

మొత్తం మీద చూసుకుంటే షియోమీ 18 ప్రో, షియోమీ 18T కి సంబంధించిన లీక్స్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అంచనాలను అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా, ఇండియాలో ప్రో మోడల్ మళ్లీ వస్తుందా అనేది, అలాగే షియోమీ 18T కెమెరా, పెర్ఫార్మెన్స్ ఫీచర్లు ఎంతవరకు నిజమవుతాయనేది వేచి చూడాలి. అధికారిక ధర, సేల్స్ డేట్, ఇండియా వేరియంట్ పూర్తి స్పెసిఫికేషన్స్ అనౌన్స్ చేసిన తర్వాతే ఈ స్మార్ట్‌ఫోన్ల అసలు సత్తా ఏంటో తెలుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories