ప్రపంచంలోనే మొట్టమొదటి 18జీబీ ర్యామ్‌ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్, ధర చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

First Published Mar 6, 2021, 7:02 PM IST

18 జీబీ ర్యామ్ స్మార్ట్‌ఫోన్ కల నెరవేరింది. ప్రపంచంలో మొట్టమొదటి 18 జీబీ ర్యామ్ తో రెడ్‌మాజిక్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల చేశారు. ప్రత్యేకత ఏమిటంటే రెడ్‌మాజిక్ 6 ప్రో టెన్సెంట్ గేమ్‌తో భాగస్వామ్యంతో చేసుకోంది.

రెడ్‌మాజిక్ 6 ప్రో 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే కలిగిన గేమింగ్ స్మార్ట్‌ఫోన్. ప్రపంచంలోనే ఇంత రిఫ్రెష్ రేట్ డిస్ ప్లేతో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా డ్‌మాజిక్ 6 ప్రో నిలిచింది. రెడ్‌మాజిక్ 6 సిరీస్ కింద కంపెనీ రెడ్‌మాజిక్ 6, రెడ్‌మాజిక్ 6 ప్రోతో రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది.
undefined
రెడ్‌మాజిక్ 6, రెడ్‌మాజిక్ 6 ప్రో ఫీచర్లుఈ రెండు గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో టచ్ కొరియాగ్రాఫర్ టెక్నాలజీ ఉంది. ఇది కాకుండా మీ అవసరాలకు అనుగుణంగా డిస్ ప్లే రిఫ్రెష్ రేటును అడ్జస్ట్ చేసే ఇంటెలిజెంట్ అడాప్టివ్ టెక్నాలజీ కూడా ఉంది. ఇది గేమర్స్ వేగంగా గేమ్స్ ఆడటానికి సహాయపడుతుంది. ఈ ఫోన్‌లో సిపిహెచ్‌వై-డిఎస్‌ఐ టెక్నాలజీ కూడా ఉంది.
undefined
ఈ రెండు రెడ్‌మాజిక్ 6 సిరీస్ ఫోన్‌లలో ఇంటర్నల్ టర్బోఫాన్‌తో కొత్త ICE 6.0 మల్టీ డైమెన్షనల్ సిస్టమ్ ఉంది. ధర గురించి మాట్లాడితే రెడ్‌మాజిక్ 6 ప్రారంభ ధర 3,799 యువాన్లు, అంటే సుమారు 42,760 రూపాయలు. అలాగే రెడ్‌మాజిక్ 6 ప్రో ధర 4,399 యువాన్లు అంటే సుమారు 49,510 రూపాయలు. ప్రస్తుతం ఈ ఫోన్‌ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసినట్లు వార్తలు లేనప్పటికీ, మార్చి 11 నుండి చైనాలో ఈ రెండు ఫోన్‌ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
undefined
ఈ రెండు ఫోన్‌లలో 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది కాకుండా రెండు ఫోన్‌లలో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ అందించారు. 8జి‌బి 12జి‌బి 16జి‌బి 18జి‌బి వరకు ర్యామ్ ఆప్షన్ తో వస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడితే దీనిలో 128జి‌బి 256జి‌బి 512జి‌బి స్టోరేజ్ లభిస్తుంది. ఈ ఫోన్‌లో కంపెనీ సొంత ఆండ్రాయిడ్ ఆధారిత రెడ్‌మాజిక్ ఓఎస్ 4.0 లభిస్తుంది. రెండు ఫోన్‌లలో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, మూడు మైక్‌లతో స్టీరియో స్పీకర్ లభిస్తుంది.
undefined
కెమెరా గురించి చూస్తే రెండు ఫోన్‌లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లభిస్తుంది. ఇందులో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్ కెమెరా, రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ కెమెరా, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మాక్రో కెమెరా, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రెడ్‌మాజిక్ 6 ప్రోలో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే రెడ్‌మాజిక్ 6లో 5050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
undefined
click me!