స్మార్ట్‌ఫోన్స్‌ అమ్మకాలలో షియోమి రికార్డ్.. కేవలం 5 నిమిషాల్లోనే 3 లక్షల స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు..

First Published Mar 5, 2021, 6:19 PM IST

 గత కొన్ని నెలలుగా చైనా తయారీ సంస్థ షియోమి స్మార్ట్ ఫోన్ సేల్స్ లో రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఇటీవలే షియోమి సబ్ బ్రాండ్ రెడ్‌మి కింద కె 40 సిరీస్‌ను విడుదల చేసింది,   రెడ్‌మి కె40 సిరీస్‌ను గత నెలలో చైనాలో లాంచ్ చేశారు. రెడ్‌మి కె40 సేల్ గురించి ఇప్పుడు కంపెనీ  ప్రత్యేకంగా పేర్కొంది, ఈ సిరీస్‌లో 300 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లు ఫస్ట్ సెల్‌లోనే అమ్ముడయ్యాయి అని తెలిపింది.
 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫస్ట్ సేల్ లో భాగంగా కేవలం ఐదు నిమిషాల్లో 3,00,00 లక్షల స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి. రెడ్‌మి కె40 సిరీస్ కింద రెడ్‌మి కె40, రెడ్‌మి కె40 ప్రో, రెడ్‌మి కె 40 ప్రో ప్లస్ తో మొత్తం మూడు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ తదుపరి సెల్ మార్చి 8న నిర్వహించనున్నారు. అంతకుముందు కేవలం ఐదు నిమిషాల్లో 3,50,000 ఎం‌ఐ 11 స్మార్ట్ ఫోన్స్ అమ్మినట్లు కంపెనీ పేర్కొంది. రెడ్‌మి కె 40 సిరీస్ ప్రత్యేకమైన ఫీచర్స్ ఎంటో తెలుసుకుందాం....
undefined
ఆండ్రాయిడ్ 11 MIUI 12 ఓఎస్ రెడ్‌మి కె 40, రెడ్‌మి కె 40 ప్రో, రెడ్‌మి కె 40 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లలో అందించారు. రెడ్‌మి కె40 6.67 అంగుళాల పూర్తి హెచ్‌డి ఇ4 అమోలెడ్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. పంచ్ హోల్ డిస్ ప్లేతో ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, ఎల్‌పిడిడిఆర్ 5 12 జిబి వరకు ర్యామ్, యుఎఫ్ఎస్ 3.1తో 256 జిబి వరకు స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. రెడ్‌మి కె40 లో నాలుగు బ్యాక్ కెమెరాలతో వస్తుంది, వీటిలో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్ కెమెరా, సెల్ఫీ కోసం 40 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్‌లో 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 6, 4520 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
undefined
రెడ్‌మి కె 40 ప్రో, రెడ్‌మి కె 40 ప్రో ప్లస్ ఫీచర్స్ చూస్తే డిస్ ప్లే సైజ్, నాణ్యత రెడ్‌మి కె40లాగానే ఉంటుంది. ఈ రెండు ఫోన్‌లలో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంది. రెడ్‌మి కె 40 ప్రోను 8 జీబీ ర్యామ్‌తో, రెడ్‌మి కె 40 ప్రో ప్లస్ 12 జీబీ ర్యామ్‌తో కొనుగోలు చేయవచ్చు.
undefined
రెడ్‌మి కె40 ప్రోలో 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, రెండు ఫోన్‌లలో సెల్ఫీల కోసం 40 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. రెడ్‌మి కె 40 ప్రో ప్లస్ లోని ప్రైమరీ లెన్స్ 108 మెగాపిక్సెల్‌ కెమెరాతో వస్తుంది. ఈ రెండు ఫోన్ లలో 5జి, 4 జి ఎల్‌టిఇ, వై-ఫై 6 వంటి ఫీచర్లతో పాటు 256 జి‌బి వరకు స్టోరేజ్ లభిస్తుంది. ఇంకా ఈ రెండు ఫోన్‌లలో 4520 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
undefined
undefined
click me!