ఈ రెండు ఫోన్‌లు స్ట్రెచబుల్ పిఈటి5 నుండి తయారు చేసిన ప్రొటెక్షన్ తో వస్తాయి. అలాగే ఈ రెండు ఫోన్‌లు వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపిఎక్స్8 రేటింగ్ పొందాయి.
భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ .1,49,999 కాగా, 12జిబి ర్యామ్, 512 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,57,999. ఈ ఫోన్‌ను ఫాంటమ్ బ్లాక్ ఇంకా ఫాంటమ్ గ్రీన్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. అలాగే 8జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ధర రూ. 84,999, 256జిబి స్టోరేజ్ 8 జిబి ర్యామ్ ధర రూ. 88,999. ఈ ఫోన్‌ను ఫాంటమ్ బ్లాక్, క్రీమ్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ఫోన్‌లు సెప్టెంబర్ 10 నుండి అందుబాటులోకి వస్తాయి.