ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్‌ను ఎందుకు లాంచ్ చేయాలి ? సీక్రెట్ బయటపెట్టిన ఆపిల్ సీఈవో..

First Published | Oct 11, 2023, 12:54 PM IST

ప్రతి సంవత్సరం ఆపిల్ ఒకటి లేదా మరికొన్ని కొత్త ఫోన్స్, ప్రొడక్ట్స్  లాంచ్  చేస్తుంటుంది. దీని అవసరాన్ని  గురించి ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. తాజాగా ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. వీటికి అధిక ధర ఉన్నప్పటికీ, కస్టమర్లు కొత్త ఫోన్‌లను ప్రి-బుకింగ్ అలాగే సేల్ ద్వారా సొంతం చేసుకున్నారు. 

 ఇప్పుడు, ప్రతి సంవత్సరం ఆపిల్ ఒకటి లేదా కొన్ని కొత్త  మోడల్స్ ఫోన్‌లను లాంచ్ చేస్తుంటుంది. దీనిపై చాలా మంది సంతోషిస్తే, మరికొంత మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఐఫోన్‌లో పెద్దగా మార్పు, కొత్తదనం  లేదని కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆపిల్ చేసిన కొన్ని కొత్త మార్పులు ఉన్నప్పటికీ, ప్రతి సంవత్సరం మనకు కొత్త ఐఫోన్ అవసరమా అనే ప్రశ్న వినిపిస్తుంది. అయితే ఈ  ప్రశ్నకు ఆపిల్ సీఈవో టిమ్ కుక్ సమాధానమిచ్చారు.
 

బ్రూట్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టిమ్ కుక్‌ను ఈ ప్రశ్న అడిగగా  అతను దానికి సమాధానం ఇచ్చారు. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి సంవత్సరం ఐఫోన్ కావాలనుకునే వారు ఐఫోన్‌ను   కలిగి ఉండటం మంచి విషయమని నేను భావిస్తున్నాను.
 


అలాగే, ఆపిల్ వినియోగదారులకు ఫోన్‌పై ట్రేడింగ్ చేసే అవకాశాన్ని కల్పించామని, అంటే వారి పాత ఫోన్‌ను కొత్తదానికి మార్చుకునే అవకాశాన్ని కల్పించామని తెలిపింది. "కాబట్టి పాత ఫోన్ ఇంకా పనిచేస్తుంటే మేము దానిని తిరిగి రిసేల్ చేస్తాము" అని టిమ్ కుక్ చెప్పారు.  
 

అలాగే, పని చేయని ఫోన్లు కూడా పూర్తిగా వేస్ట్ కాదని టిమ్ కుక్ తెలిపారు. "ఫోన్ [ఐఫోన్] పని చేయకపోతే దానిని విప్పి లేదా ఓపెన్ చేసి    కొత్త ఐఫోన్‌ను తయారు చేయడానికి అందులోని పార్ట్స్ తీసుకోవడానికి మాకు మార్గాలు ఉన్నాయి" అని Apple CEO టిమ్ కుక్ చెప్పారు. 
 

 పర్యావరణం అండ్ పర్యావరణ స్పృహ గురించి చాలా చర్చలు జరుగుతున్నందున ఈ ప్రశ్న అడిగారు. ఆపిల్ పర్యావరణ స్పృహతో  ఉంది ఇంకా  ప్రముఖ కంపెనీలలో ఒకటి. బహుశా అందుకే ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్‌ లాంచ్  ఉండాల అనే ప్రశ్న పర్యావరణ స్పృహకు అనుకూలంగా లేదని చాలా మంది పేర్కొన్నారు. 
 

అయితే, పాత ఐఫోన్‌ల నుండి బెస్ట్  వాటిని పొందడానికి ఆపిల్ ఏమి చేయగలదో దానిపై కసరత్తు చేస్తున్నట్లు టిమ్ కుక్ చెప్పారు. ఆపిల్ 2030 నాటికి పూర్తిగా కార్బన్ న్యూట్రల్ ఉండాలనే లక్ష్యంతో  ఉంది, అందుకు ఆ దిశలో ఒక ముఖ్యమైన అడుగు వేసింది. 
 

2023 ఐఫోన్ ఈవెంట్‌లో కొత్త ఆపిల్ వాచ్ మోడల్స్ ని  ప్రవేశపెట్టింది, ఈ వాచ్ మొదటి 100% పూర్తిగా కార్బన్ న్యూట్రల్ ప్రోడక్ట్. ఈ విధంగా 2030 నాటికి ఐఫోన్ పూర్తిగా కార్బన్ న్యూట్రల్‌గా ఉండాలని టార్గెట్ పెట్టుకున్నట్లు టిమ్ కుక్ చెప్పారు.
 

Latest Videos

click me!