వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే WABetaInfo కూడా వెల్లడించింది. iOS 10, iOS 11 కోసం WhatsApp సపోర్ట్ అక్టోబర్ 24 నుండి సపోర్ట్‌ను ముగిస్తున్నట్లు పేర్కొంటున్న స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. ఇప్పుడు యూజర్లు వారి ఐఫోన్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది, అయితే సమస్య ఏమిటంటే మీకు ఐఫోన్ 5 లేదా ఐఫోన్ 5సి ఉంటే మీరు iOS 12కి అప్‌గ్రేడ్ చేయలేరు.
iPhone 5s అంతకంటే పై మోడల్‌లు iOS 12కి అప్‌డేట్‌ను పొందుతాయి. WhatsApp FAQ పేజీని కూడా అప్ డేట్ చేసింది. గత సంవత్సరం WhatsApp Android 4.0కి సపోర్ట్ నిలిపివేసింది.