ఫోటో ఎడిటింగ్ ఫీచర్ ఇప్పుడు వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది, అంటే మీరు మీ ల్యాప్‌టాప్ నుండి ఫోటోను వాట్సాప్‌లో పంపే ముందు దాన్ని ఎడిట్ చేయవచ్చు. ప్రస్తుతం, ఈ అప్‌డేట్ కొంతమంది యూజర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరికి అందుబాటులోకి తీసుకురానుంది.
వాట్సాప్ ఈ ఫీచర్ కొన్ని రోజుల క్రితం బీటా వెర్షన్‌లో కనిపించింది. వాట్సాప్ వెబ్ కొత్త అప్‌డేట్ ద్వారా వినియోగదారులు ఫోటోను ఎడిట్ చేసే ఆప్షన్ పొందుతారు. అలాగే స్టిక్కర్‌లను కూడా జోడించే ఆప్షన్ కూడా ఉంది. ఫోటోలను పంపడానికి ముందు ఇప్పుడు మీరు ఎడిట్ చేయవచ్చు, స్టిక్కర్‌లను జోడించవచ్చు, కామెంట్ టైప్ చేయవచ్చు ఇంకా ఎమోజీని జోడించవచ్చు. ఒక విధంగా మొబైల్ యాప్ ఎడిటింగ్ తో సమానంగా ఉంటుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మొబైల్ యాప్‌లోని ఫోటో ఎడిటింగ్ టూల్‌లో ఎమోజిని జోడించే ఆప్షన్ అందుబాటులో లేదు, వెబ్ వెర్షన్‌లో మాత్రం ఈ ఫీచర్ ఉంది.
వాట్సాప్ ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి మీరు ముందుగా ఒక ఫోటోను సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు ఎడిటింగ్ టూల్స్ చూస్తారు. మీరు కింద చూపించే స్క్రీన్ షాట్ ద్వారా ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చూడవచ్చు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం వాట్సాప్ ఐఫోన్ వినియోగదారుల కోసం వ్యూ వన్స్ ఫీచర్‌కి ఒక అప్‌డేట్‌ను విడుదల చేసింది. వాట్సప్‌లో ఒకసారి వ్యూ వన్స్ ఫీచర్‌ని ఆన్ చేసిన తర్వాత మీరు మెసేజ్ చూసిన తర్వాత ఆ మెసేజ్ అదృశ్యమవుతుంది. వాట్సాప్ వ్యూ వన్స్ ఫీచర్‌ను ఫోటోలు, వీడియోలు, మెసేజులలో ఉపయోగించవచ్చు.
వాట్సాప్ వ్యూ వన్స్ ఫీచర్ ప్రస్తుతం ఐఫోన్ వినియోగదారుల కోసం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌తో వాట్సాప్ కొత్త వెర్షన్ విడుదల చేయబడింది, దీనిని మీరు యాపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.