64 ఎం‌పి కెమెరాతో వివో సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. అందిస్తున్న అప్ డేట్ ఫీచర్స్ తెలుసుకోండి..

First Published Aug 10, 2021, 2:12 PM IST

 గత కొన్ని రోజులుగా స్మార్ట్ ఫోన్ బ్రాండ్  వివో  కొత్త స్మార్ట్‌ఫోన్ వివో వై53ఎస్ పై లీక్ నివేదికలు వెలువడ్డాయి, అయితే ఇప్పుడు కంపెనీ చివరకు వివో వై 53ఎస్ ను భారతదేశంలో విడుదల చేసింది. వివో వై53ఎస్ 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాతో పరిచయం చేశారు. 

అంతేకాకుండా ఫోన్‌లో 128జి‌బి వరకు స్టోరేజ్ లభిస్తుంది. వివో వై53ఎస్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వివో వై53ఎస్  రెడ్ మీ నోట్  10 ప్రొ మ్యాక్స్, స్యామ్సంగ్ గెలాక్సీ ఎం51 వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది.
 

వివో వై53ఎస్ ధర

వివో వై53ఎస్ ని సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌లో లాంచ్ చేశారు. వివో వై53ఎస్  8జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ ధర రూ .19,490. ఈ ఫోన్‌ను డీప్ సీ బ్లూ, ఫెంటాస్టిక్ రాంబో కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, టాటా క్లిక్, వివో ఆన్‌లైన్ స్టోర్‌ల నుండి ఫోన్ సేల్స్ ప్రారంభమైంది. లాంచింగ్ ఆఫర్ కింద వివో వై53ఎస్ లను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులపై రూ .1500 క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయవచ్చు.  

వివో వై53ఎస్ స్పెసిఫికేషన్‌లు

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1, 6.58-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్, డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 60Hz, అంతేకాకుండా ఫోన్‌లో మీడియాటెక్ హెలియో జి80 ప్రాసెసర్, 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ ఉన్నాయి, వీటిని మెమరీ కార్డ్ సహాయంతో  మరింత పెంచుకోవచ్చు.
 

వివో వై53ఎస్ కెమెరా

కెమెరా గురించి మాట్లాడితే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని వివో వై53ఎస్ లో ఇచ్చారు, దీని ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్ ఎపర్చరు f/79, రెండవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఎపర్చరు f/2.4, మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. సెల్ఫీ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

వివో వై53ఎస్ బ్యాటరీ

కనెక్టివిటీ కోసం ఈ ఫోన్‌లో 4జి ఎల్‌టి‌ఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వి5, జి‌పి‌ఎస్, యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీని  ఉంది. ఫోన్ బరువు 190 గ్రాములు.
 

click me!