షియోమి అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ భారతదేశంలో విడుదల చేయనున్న సంగతి మీకు తెలిసిందే. ఎంఐ 11 అల్ట్రా ధర రూ. 69,990. ఈ ధర వద్ద 256 జిబి స్టోరేజ్ తో 12జిబి ర్యామ్ లభిస్తుంది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారతీయ అథ్లెట్లందరికీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ 11 అల్ట్రా ఇస్తున్నట్లు షియోమి తెలిపింది. షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈసారి టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు కనబరిచిన ప్రదర్శన అద్భుతం. అంతకుముందు 2012లో భారతదేశనికి 6 పతకాలు వచ్చాయి. ఈ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని సాధించాడు, ఇది ఒలింపిక్ క్రీడలలో భారతీయ అథ్లెట్‌కు మొదటి బంగారు పతకం. ఈసారి భారతదేశానికి ఒక స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్య పతకాలు అంటే మొత్తం 7 పతకాలు లభించాయి.
ఎంఐ 11 అల్ట్రా ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12 ఎంఐ 11 అల్ట్రాలో ఇచ్చారు. 6.81-అంగుళాల WQHD+ E4 AMOLED డిస్‌ప్లే, 1440x3200 పిక్సెల్స్ రిజల్యూషన్, డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz, టచ్ శాంప్లింగ్ రేటు 480Hz. దీని బ్రైట్ నెస్ 1,700 నిట్స్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఫోన్ డిస్‌ప్లేపై వస్తుంది. బ్యాక్ ప్యానెల్‌లో 1.1-అంగుళాల సెకండ్ డిస్‌ప్లే ఉంటుంది, దీనిలో టైమ్ మొదలైన వాటి గురించి సమాచారం ఉంటుంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం అడ్రినో 660 జిపియూ, 12జిబి LPDDR5 ర్యామ్, 256 జిబి స్టోరేజ్ ఉన్నాయి.
ఎంఐ 11 అల్ట్రా కెమెరా
ఫోన్ కెమెరా గురించి మాట్లాడితే ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్స్ ఎపర్చరు f/1.95, రెండవ లెన్స్ 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఎపర్చరు f/2.2 అండ్ 128 డిగ్రీల వ్యూ కలిగి ఉంది. మూడవ లెన్స్ 48 మెగాపిక్సెల్స్ దీనితో 120x డిజిటల్ జూమ్ అందుబాటులో ఉంది. సెల్ఫీ కోసం ఫోన్‌లో 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ
కనెక్టివిటీ కోసం ఎంఐ 11 అల్ట్రాలో 5జి, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ వి5.2, జిపిఎస్, ఏజిపిఎస్, NavIC, ఎన్‌ఎఫ్‌సి, యూఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఐఆర్ బ్లాస్టర్ అండ్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. దీనిలో 5000mAh బ్యాటరీని ఉంది, 67W వైర్ అండ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ 10W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్ IP68 రేటింగ్ పొందింది, అంటే నీటిలో పడితే త్వరగా క్షీణించదు. దీని బరువు 234 గ్రాములు.