వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్

Published : Aug 27, 2025, 09:51 PM IST

WhatsApp New Feature : కాల్ మిస్ అయిన తర్వాత వెంటనే వాయిస్ మెసేజ్ పంపే కొత్త ఫీచర్‌ను వాట్సాస్ తీసుకోస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ బీటా యూజర్లతో పరీక్షిస్తోంది.

PREV
15
వాట్సాప్‌లో కాల్స్‌కు కొత్త వాయిస్ మెసేజ్ ఫీచర్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. మిస్ అయిన కాల్‌ తర్వాత వెంటనే వాయిస్ మెసేజ్ పంపే అవకాశం కల్పించే ఫీచర్‌ను ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంచింది. ఇది ప్రస్తుతం కొద్దిమంది ఆండ్రాయిడ్ బీటా యూజర్లు మాత్రమే వినియోగించగలుగుతున్నారు.

25
ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో టెస్టింగ్ ప్రారంభం

ఫీచర్ ట్రాకర్ WABetaInfo తెలిపిన వివరాల ప్రకారం, ఆండ్రాయిడ్‌లోని WhatsApp బీటా వెర్షన్ 2.25.23.21 అప్‌డేట్ చేసుకున్న వినియోగదారులకు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. ఒక కాల్‌కి సమాధానం రాకపోతే, కాల్ స్క్రీన్ కిందభాగంలో కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. 

అక్కడి నుంచి వినియోగదారులు వెంటనే వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి పంపవచ్చు లేదా మళ్లీ కాల్ చేయవచ్చు. అంటే మీ కాల్ ను లిఫ్ట్ చేయకపోతే, వారికి మీరు చెప్పాలనుకున్న విషయాన్ని వాయిస్ మెసేజ్ లో పంపవచ్చు.

35
వాట్సాప్ చాట్‌లో కొత్త ఆప్షన్

ఈ కొత్త వాయిస్ మెసేజ్ షార్ట్‌కట్ మిస్ కాల్ ఉన్న చాట్ విండోలో కూడా కనిపిస్తుంది. దీంతో వెంటనే ఫాలో-అప్ మెసేజ్ పంపే అవకాశం ఉంటుంది. రికార్డ్ చేసిన వాయిస్ మెసేజ్ ఆటోమేటిక్‌గా చాట్‌లోకి చేరుతుంది. రిసీవర్ తనకు సమయం ఉన్నప్పుడు ఆ మెసేజ్ విని స్పందించవచ్చు. అదే సమయంలో మిస్ కాల్ నోటిఫికేషన్ కూడా కనిపిస్తూనే ఉంటుంది.

మిస్ కాల్ తర్వాత వెంటనే వాయిస్ మెసేజ్ పంపే ఈ ఫీచర్ వినియోగదారులకు సమయాన్ని ఆదా చేస్తూ కమ్యూనికేషన్‌ను మరింత సులభతరం చేస్తుంది. ప్రస్తుతం ఇది కొద్దిమంది బీటా టెస్టర్లకే పరిమితం కాగా, త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.

45
iOS బీటా యూజర్లకు కొత్త మెసేజ్ మేనేజ్‌మెంట్

వాట్సాప్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకే కాకుండా iOS బీటా యూజర్లకూ కొత్త ఫీచర్ అందించింది. వారు ఇప్పుడు ఒకేసారి అనేక మెసేజ్‌లను సులభంగా సెలెక్ట్ చేసి కాపీ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కొత్త మెనూ ఆప్షన్ రూపంలో అందుబాటులోకి వచ్చింది.

55
వాట్సాప్‌ కు మరిన్ని అప్‌డేట్స్

ఈ వాయిస్ మెసేజ్ ఫీచర్‌తో పాటు వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లను పరీక్షిస్తోంది. త్వరలో రైటింగ్ హెల్ప్ అసిస్టెంట్ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా యూజర్లకు టెక్స్ట్ రాయడంలో సజెషన్లు వస్తాయి. అలాగే మోషన్ ఫోటోస్ సపోర్ట్ కూడా టెస్టింగ్‌లో ఉంది. ఇవి యూజర్లు ఫోటోలను మరింత ఆకర్షణీయంగా షేర్ చేసుకునేందుకు సహాయపడతాయి.

ఇటీవలే వాట్సాప్ క్రిప్టో స్కామ్ యాడ్స్‌ను అడ్డుకునే ఫీచర్, గ్రూప్ కాల్స్ షెడ్యూల్ చేసే సదుపాయంను కూడా ప్రకటించింది.

Read more Photos on
click me!

Recommended Stories