ఎలన్ మస్క్‌ది ఎంత పెద్ద మనసు, గ్రోక్ ఇమాజిన్ ఫ్రీగా వాడుకోవచ్చట

Published : Aug 27, 2025, 02:19 PM IST

ఎలాన్ మస్క్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. ప్రతిది అమ్మకానికి పెట్టే కమర్షియల్ వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఎలన్ తన గ్రోక్ ఇమాజిన్ AI సాధనాన్ని మాత్రం అందరికీ ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. 

PREV
15
గ్రోక్ ఇమాజిన్ అందరికీ ఉచితం

X, టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత అయతే ఎలాన్ మస్క్ కమర్షియల్ వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకున్నారు. అయితే తన కొత్త AI సాధనం గ్రోక్ ఇమాజిన్‌ను మాత్రం ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఇది కావాలంటే కొంత డబ్బులను చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యూజర్లకు ఇది ఫ్రీ.ఈ నిర్ణయం కంటెంట్ సృష్టికర్తలు, కళాకారులు, మార్కెటర్లకు ఎంతో ఉపయోగకరం.

25
గ్రోక్ ఇమాజిన్ అంటే ఏమిటి?

గ్రోక్ ఇమాజిన్ అనేది AI సాంకేతికతను ఉపయోగించి వీడియోలు, చిత్రాలను సృష్టించే  ఒక సాధనం. ఎలాన్ మస్క్ తన X పేజీలో గ్రోక్ ను ఫ్రీగా ఇస్తున్నట్టు ప్రకటించారు. జూలై 28, 2025న చెల్లింపు వినియోగదారులకు మాత్రమే ప్రారంభించిన ఈ సాధనం చాలా తక్కువ సమయంలోనే  అందరి యూజర్లకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు.

35
గ్రోక్ ఇమాజిన్ ప్రత్యేకతలు

గ్రోక్ ఇమాజిన్ సాధనం అనేక AI మోడళ్లను కలిగి ఉంది. దీని ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. దీన్ని సాయంతో చిత్రాలను సృష్టించవచ్చు. అలాగే  6 సెకన్ల వీడియోలను సంగీతంతో సృష్టించవచ్చు. ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు. ఫిల్టర్లు, ఎఫెక్ట్‌లను జోడించవచ్చు.  

45
యూజర్ల ఆనందం

గ్రోక్ ఇమాజిన్ ఉచితంగా అందుబాటులోకి రావడాన్ని ఎంతో మంది నమ్మలేకపోతున్నారు. ఈ విషయంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ సృష్టికర్తలు గ్రోక్ ఇమాజిన్ తో మరింత సులువుగా వీడియోలను చేయగలరు.

55
AI శక్తి అందరికీ అందేలా

ఎలాన్ మస్క్ చేసిన ఈ పని ఎంతో మంది లాభాన్ని అందిస్తుంది. AI శక్తితో కూడిన వీడియోలు, ఫోటోలు అందరికీ అందుబాటులోకి తెస్తుంది. ఈ ఉచిత సేవ వినోదం, ప్రకటనలు, బ్రాండింగ్, సోషల్ మీడియా రంగాలలో సృజనాత్మకతను మరింతగా పెంచుతుందని భావిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories