మెటా వెల్లడించిన వివరాల ప్రకారం, వాట్సాప్‌లో రెండు రకాల లోపాలు గుర్తించారు. ఇవి విండోస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
1. విండోస్ యూజర్లకు ముప్పు: విండోస్ వెర్షన్ వాట్సాప్ లో 'అటాచ్‌మెంట్ స్పూఫింగ్' అనే బగ్ ను గుర్తించారు. అంటే, హ్యాకర్లు పంపే ఒక ప్రమాదకరమైన ఫైల్ చూడటానికి మామూలు డాక్యుమెంట్‌లాగే కనిపిస్తుంది. కానీ యూజర్ దానిని క్లిక్ చేయగానే, అది ఒక ప్రోగ్రామ్‌లా రన్ అయ్యి ఫోన్ లేదా కంప్యూటర్‌ను డ్యామేజ్ చేస్తుంది.
2. ఆండ్రాయిడ్ & ఐఓఎస్ యూజర్లకు ముప్పు: రెండో బగ్ మీడియా మెసేజ్‌లకు సంబంధించింది. హ్యాకర్లు దీని ద్వారా ఫోన్‌లోకి బయటి కంటెంట్‌ను లోడ్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫోన్ సిస్టమ్ హ్యాక్ అవ్వడమే కాకుండా, మీ ప్రైవేట్ డేటా కూడా చోరీకి గురయ్యే ఛాన్స్ ఉంది.