iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో వస్తోంది.. కెమెరా అదిరిపోద్ది, ఫీచర్లు మామూలుగా లేవుగా!

Published : May 04, 2026, 10:50 PM IST

iPhone 18 Pro : ఆపిల్ తన ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ను ఈ సెప్టెంబర్‌లో లాంచ్ చేయనుంది. ఇందులో కొత్త A20 ప్రో చిప్‌సెట్, వేరియబుల్ అపెర్చర్ కెమెరా, సరికొత్త కలర్ ఆప్షన్స్ ఉండబోతున్నాయి.

PREV
16
ఐఫోన్ 18 ప్రో: కొత్త ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

ఆపిల్ లవర్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 18 ప్రో సిరీస్ వివరాలు బయటకు వచ్చేశాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. కేవలం ఐఫోన్ 18 ప్రో మాత్రమే కాదు, దీనితో పాటు ఐఫోన్ అల్ట్రా లేదా ఫోల్డ్ మోడల్స్ కూడా సందడి చేయనున్నాయని లీక్స్ పేర్కొంటున్నాయి. బేస్ మోడల్ ఐఫోన్ 18 మాత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడే ఛాన్స్ ఉందట. ఈ కొత్త ఫోన్లలో ఏయే మార్పులు ఉండబోతున్నాయి? ధర ఎంత ఉండొచ్చు? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

26
ఐఫోన్ 18 ప్రో లాంచ్ ఎప్పుడు? ధర ఎంత?

సాధారణంగా ప్రతి ఏటా సెప్టెంబర్‌లో ఆపిల్ తన కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తుంది. అదే పద్ధతిలో ఐఫోన్ 18 ప్రో సిరీస్ కూడా సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది. ఇక ధర విషయానికి వస్తే, ఫోన్ తయారీ ఖర్చులు పెరిగినప్పటికీ, ఆపిల్ తన కస్టమర్ల కోసం పాత ధరకే అంటే సుమారు రూ. 92,000 లకు అందించే ఆలోచనలో ఉందట. అయితే అమెరికాలో రేట్లు మారకపోయినా, భారత్‌లో మాత్రం ట్యాక్సులు, ఇతర కారణాల వల్ల ఐఫోన్ 17e తరహాలోనే ధరలు పెరిగే అవకాశం ఉంది.

36
కళ్లు చెదిరే కొత్త కలర్స్

ఐఫోన్ 18 ప్రో ఈసారి సరికొత్త రంగుల్లో మెరిసిపోనుంది. మ్యాక్‌వరల్డ్ రిపోర్ట్ ప్రకారం.. లైట్ బ్లూ, డార్క్ చెర్రీ, డార్క్ గ్రే, సిల్వర్ కలర్లలో ఈ ఫోన్ రానుంది. ప్రముఖ టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ కూడా బ్లాక్, సిల్వర్, వైన్ రెడ్ కలర్స్ ఉంటాయని లీక్ చేశారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ చెప్పినదాని ప్రకారం, ఈసారి 'డీప్ రెడ్' కలర్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది. ఇది పాత ఆరెంజ్ కలర్‌ను రీప్లేస్ చేయనుందని సమాచారం.

46
ఐఫోన్ 18 ప్రో డిజైన్‌లో భారీ మార్పులు

డిజైన్ పరంగా ఐఫోన్ 18 ప్రో పాత మోడల్‌లాగే ఉన్నా, కొన్ని కీలక మార్పులు కనిపిస్తాయి. ఫోన్ వెనుక ఉండే కెమెరా ప్లేట్ ఈసారి కొంచెం మందంగా ఉండబోతోంది. అలాగే బ్యాటరీ సైజ్ పెంచడం వల్ల ఫోన్ బరువు, మందం కూడా కొద్దిగా పెరగొచ్చు. బ్యాక్ గ్లాస్‌కు, అల్యూమినియం ఫ్రేమ్‌కు మధ్య కలర్ గ్యాప్ లేకుండా యూనిఫైడ్ లుక్ వచ్చేలా ఆపిల్ ప్లాన్ చేస్తోంది.

56
ఐఫోన్ 18 ప్రో డిస్ప్లే ఎలా వుండనుంది?

ఈసారి 6.3 అంగుళాల ప్రోమోషన్ 120Hz డిస్ప్లేను ఆపిల్ కంటిన్యూ చేస్తోంది. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే.. అండర్ డిస్ప్లే ఫేస్ ఐడీ. దీనివల్ల స్క్రీన్ పైన ఉండే డైనమిక్ ఐలాండ్ సైజు దాదాపు 35 శాతం వరకు తగ్గుతుంది. దీనివల్ల ఫోన్ చూసేందుకు మరింత స్టైలిష్‌గా, ఎక్కువ స్క్రీన్ స్పేస్‌తో కనిపిస్తుంది.

66
ఐఫోన్ 18 ప్రో లో పవర్ ఫుల్ ప్రాసెసర్, కెమెరా

ఐఫోన్ 18 ప్రో లో సరికొత్త A20 ప్రో చిప్‌సెట్‌ను వాడుతున్నారు. ఇది TSMC 2nm ప్రాసెస్ మీద తయారైంది. పాత వాటికంటే 30% వేగంగా పనిచేస్తూ, 15% తక్కువ బ్యాటరీని వాడుకుంటుంది. కెమెరా విషయానికి వస్తే.. 48MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. కానీ ఈసారి 'మెకానికల్ వేరియబుల్ అపెర్చర్' సిస్టమ్‌ను తెస్తున్నారు. దీనివల్ల తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు. అలాగే ఐఫోన్ సొంతంగా తయారు చేసిన C2 మోడెమ్ ద్వారా 5G శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ కూడా అందుబాటులోకి రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories