వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ : 120 రోజుల తరువాత వారి ఎకౌంట్లు పూర్తిగా డిలెట్..

First Published | Feb 24, 2021, 12:21 PM IST

వాట్సాప్  కొత్త ప్రైవసీ పాలసీ ఫిబ్రవరి 8 నుండి అమల్లోకి రావాల్సి ఉంది, కాని  కొన్ని వివాదాల  మధ్య వాట్సాప్  సంస్థ ప్రైవసీ పాలసీని మే వరకు వాయిదా వేసింది. ఇప్పుడు మళ్ళీ వాట్సాప్ ప్రైవసీ పాలసీ విధానానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల అయ్యింది, దీని ప్రకారం వాట్సాప్ కొత్త  ప్రైవసీ పాలసీ విధానం 2021 మే 15 నుండి అమలు కానుంది.
 

మేలో అమలు చేయబోయే వాట్సాప్ విధానం గురించి తాజాగా ఒక కొత్త వివాదం ప్రారంభమైంది, అదేంటంటే మీరు మే 15 లోపు కొత్త వాట్సాప్ పాలసీని అంగీకరించకపోతే ఆ తర్వాత వారు ఎటువంటి మెసేజులు పంపలేరు లేదా స్వీకరించలేరు.
undefined
వాట్సాప్ వినియోగదారులు కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించే వరకు ఎటువంటి మెసేజులు పంపలేరు లేదా స్వీకరించలేరు. కొత్త నిబంధనలను అంగీకరించని వారి అక్కౌంట్ ని ఇన్ ఆక్టివ్ గా చూస్తారు, 120 రోజుల తర్వాత వారి అక్కౌంట్ పూర్తిగా తొలగించనున్నారు. అయితే ఈ నిబంధనలను అంగీకరించడానికి సంస్థ నోటిఫికేషన్లు కూడా పంపించనుంది.
undefined

Latest Videos


వాట్సాప్ కి భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు. అయితే కొత్త నిబంధనలపై వ్యతిరేకత కూడా భారతదేశంలో చాలా ఉంది. వాట్సాప్ ఇప్పుడు దాని మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్‌తో డేటాను పంచుకోవాలన్న కొత్త విధానంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అయితే అలాంటివి జరగదని వాట్సాప్ స్పష్టం చేసింది.
undefined
వాట్సాప్ ఇప్పటికే యూజర్‌ల ఐపి అడ్రస్ వంటి కొంత సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకుంటుంది. కానీ యూరప్, యు.కె వంటి దేశాలలో ఇది జరగదు, ఎందుకంటే ఈ దేశాలలో వేర్వేరు గోప్యతా చట్టాలను కలిగి ఉన్నాయి.
undefined
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటించిన తరువాత టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్ డౌన్‌లోడ్‌లో విపరీతమైన పెరుగుదల కనిపించింది. జనవరి మొదటి వారంలో భారతదేశంలో 25 మిలియన్లకు పైగా ప్రజలు సిగ్నల్‌ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అలాగే మిలియన్ల మంది ప్రజలు తమ వాట్సాప్ ఖాతాను టెలిగ్రామ్‌కు మార్చారు.
undefined
undefined
click me!