గూగుల్ పే పోటీగా వాట్సాప్ సరికొత్త ఫీచర్.. కొత్త కస్టమర్లను ఆకర్షించెందుకు భలే ఐడియా..

First Published | Sep 23, 2021, 6:33 PM IST

మీరు వాట్సాప్  ఉపయోగిస్తున్నారా.. అయితే  గత వారం రోజుల నుండి వాట్సాప్ చాట్ పైన పేమెంట్ సెటప్ నోటిఫికేషన్ గమనించే ఉంటారు. ఈ నోటిఫికేషన్ ఐ‌ఓ‌ఎస్ అండ్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే కనిపిస్తుంది. వాట్సాప్ పేమెంట్ సిస్టం చాలా కాలం క్రితం ప్రారంభించినప్పటికీ ఇంకా పూర్తిగా ప్రజాదరణ పొందలేదు. 

గూగుల్ పే, ఫోన్ పే, పేటి‌ఎం వంటి ఇతర డిజిటల్ పేమెంట్ యాప్‌లకు పోటీగా వాట్సాప్  పే రాలేకపోయింది. ఇప్పుడు వాట్సాప్ పేని భారతదేశంలో పాపులర్ చేయడానికి కంపెనీ క్యాష్‌బ్యాక్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అయితే ఈ క్యాష్‌బ్యాక్ ప్రోగ్రామ్‌ గురించి తెలుసుకుందాం...

వాట్సాప్  ఫీచర్లను ట్రాక్ చేసే WaBetaInfo అనే సైట్ నివేదిక ప్రకారం వాట్సాప్  పే కోసం క్యాష్‌బ్యాక్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ముఖ్యంగా భారతదేశంలో కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో క్యాష్‌బ్యాక్ ప్రోగ్రామ్ మరింత ముందుకు వెళ్తుందని కంపెనీ భావిస్తోంది. అన్ని ఇతర యాప్స్ లాగానే వాట్సాప్  పే కూడా యూ‌పి‌ఐ ద్వారా పనిచేస్తుంది.

Latest Videos


WABetaInfo ప్రకారం కొత్త క్యాష్‌బ్యాక్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ లో ఉంది. దీనికి సంబంధించి సైట్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. ఈ స్క్రీన్‌షాట్‌లో 'గెట్  క్యాష్‌బ్యాక్ ఆన్ యువర్ నెక్స్ట్ పేమెంట్' అండ్ 'ట్యాప్ టు గెట్ స్టార్టెడ్' అనే మెసేజ్ గిఫ్ట్ చిహ్నం కనిపిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ ప్రోగ్రామ్ కింద కస్టమర్‌లు వాట్సాప్ ద్వారా చెల్లించినందుకు రూ. 10 క్యాష్‌బ్యాక్ పొందుతారు, అయితే ఈ క్యాష్‌బ్యాక్ ప్రతి చెల్లింపుతో  లేదా మొదటిసారి చెల్లింపుతో  అందుబాటులో ఉంటుందా అనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు.
 

 ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రైవసీ సెట్టింగ్‌కి సంబంధించి వాట్సాప్ కూడా అలాంటి ఫీచర్‌పై పనిచేస్తోంది. వాట్సాప్ లాస్ట్ సీన్,  ప్రొఫైల్ ఫోటో, అబౌట్ పై కొత్త అప్‌డేట్‌ను విడుదల చేయబోతోంది. బీటా వెర్షన్‌లో కొత్త ఫీచర్ టెస్టింగ్ చేస్తుంది.

కొత్త అప్‌డేట్ తర్వాత ఎవరు మీ లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫోటోను చూడవచ్చో, ఎవరిని చూడకూడదో వినియోగదారులు స్వయంగా నిర్ణయించుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే మీరు మీ స్టేటస్‌ సెట్టింగ్ చేసే విధంగానే దాని ఈ సెట్టింగ్‌లను కూడా సెట్ చేయవచ్చు.

click me!