ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్ డేటాను ట్రాన్సఫర్ చేయవలసి ఉంటుంది, ఇందులో బ్లూటూత్ చాలా సహాయంగా ఉంటుంది. అయితే, దీని కోసం రెండు పెరింగ్ డివైజెస్ కి తప్పనిసరిగా బ్లూటూత్ సౌకర్యం ఉండాలి.
బ్లూటూత్ అంటే ఏమిటి?
బ్లూటూత్ అనేది ఎలక్ట్రానిక్ డివైజెస్ మధ్య డేటాను బదిలీ చేయడానికి ఉపయోగించే వైర్‌లెస్ టెక్నాలజీ. అయితే, ఈ డేటా బదిలీ సమయంలో, రెండు డివైజెస్ మధ్య గరిష్ట దూరం 10 నుండి 50 మీటర్ల వరకు ఉంటుంది. బ్లూటూత్ ద్వారా డేటాను బదిలీ చేయడానికి కేబుల్‌లు లేదా అడాప్టర్‌లు అవసరం లేదు.