వోడాఫోన్ ఐడియా బ్యాంగ్ ఆఫర్.. ఇప్పుడు ఆన్ లిమిటెడ్ ఇంటర్నెట్‌ ఫ్రీగా పొందండి.. ఎలా అంటే ?

First Published Feb 17, 2021, 1:29 PM IST

టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వి‌ఐ) కస్టమర్లకు గోప్ప బహుమతిని ఇచ్చింది. వొడాఫోన్ ఐడియా  వినియోగదారులకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది, అయితే మీరు ఈ ఫ్రీ ఆన్ లిమిటెడ్ డేటాను నిర్ణీత సమయంలో మాత్రమే ఉపయోగించుకోవచ్చు. వోడాఫోన్ ఐడియా  ఈ ప్రత్యేక ప్లాన్ ద్వారా ఈ ప్రయోజలను లభిస్తాయి. అదేంటో  వివరంగా తెలుసుకొండి...
 

వి‌ఐ తాజాగా రూ.249 ఆన్ లిమిటెడ్ ప్లాన్ విడుదల చేసింది, ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు ఉదయం 12 నుండి రాత్రి 6 గంటల వరకు ఆన్ లిమిటెడ్ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే అర్ధరాత్రి 12 గంటల తరువాత నుండి ఉదయం 6 గంటల వరకు అన్నమాట. డేటా పరిమితి ఉండదు అలాగే మీరు ఈ ఆరు గంటల్లో ఇంటర్నెట్‌ను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు.
undefined
రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసే వీఐ ప్రీ-పెయిడ్ కస్టమర్లందరికీ ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ ప్లాన్‌తో కంపెనీ డేటా రోల్‌ఓవర్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది, అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు మిగిలిన డేటాను శనివారం ఇంకా ఆదివారం ఉపయోగించవచ్చు.
undefined
విఐ రూ .249 ప్లాన్ మరిన్ని ప్రయోజనాల గురించి చెప్పాలంటే ఈ ప్లాన్ తో మీకు ప్రతిరోజూ 1.5 జిబి డేటా లభిస్తుంది. ఇది కాకుండా, అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో 5 జీబీ అదనపు డేటా కూడా లభిస్తుంది. ఇంకా ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.
undefined
కొద్ది రోజుల క్రితం వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు వూట్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కోసం వయా.కామ్ 18తో భాగస్వామ్యం చేసుకుంది. దీని కింద కంపెనీ వినియోగదారులకు వూట్ యాప్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది.
undefined
కొత్త ఆఫర్ కింద విఐ వినియోగదారులు వారి వోడాఫోన్ ఐడియా నంబర్‌ ఓ‌టి‌పి ద్వారా వూట్ యాప్ లాగిన్ అవ్వవచ్చు. లాగిన్ అయిన తర్వాత, మీరు వోడాఫోన్ ఐడియా యాప్ లో లాగిన్ చేయడం ద్వారా వూట్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ఆక్టివేట్ చేయాలి.
undefined
వూట్ యాప్ లో మీరు జాతీయ, అంతర్జాతీయ కంటెంట్‌ను చూడవచ్చు. అంతేకాదు ఈ యాప్ లో బిగ్ బాస్ లైవ్ కూడా చూడవచ్చు. ఇది కాకుండా అంతర్జాతీయ వెబ్ సిరీస్ ఒరిజినల్ కంటెంట్ కూడా అందుబాటులో ఉంటుంది. కలర్స్, ఎంటివి అన్ని షోలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
undefined
undefined
click me!