సూపర్ జూమ్ కెమెరాతో వివో కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్స్.. 12 జిబి ర్యామ్ తో అదిరిపోయే ఫీచర్లు ఇవే..

First Published Mar 12, 2021, 6:47 PM IST

చైనా టెక్నాలజి కంపెనీ వివో తాజాగా  ఎక్స్ 60 సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్  తేదీని ధృవీకరించింది. వివో ఇండియా కూడా మీడియా ఇన్వాయిస్ లు కూడా  పంపించింది. వివో ఎక్స్ 60 సిరీస్ మార్చి 25న భారతదేశంలో లాంచ్ కానుంది. 

వివో ఎక్స్ 60 సిరీస్ కోసం వివో ఇండియా జిసిస్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎక్స్ 60 సిరీస్ కింద వివో ఎక్స్60, ఎక్స్60ప్రో, ఎక్స్60ప్రో ప్లస్ జనవరిలో చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ మూడు వేరియంట్‌లను కంపెనీ త్వరలో భారత్‌లో విడుదల చేస్తుందని భావిస్తున్నారు.
undefined
వివో ఎక్స్ 60 స్పెసిఫికేషన్లుఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 11 బేస్డ్ ఆరిజిన్ ఓఎస్ 1.0 ఉంది. 6.56-అంగుళాల హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080x2376 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌, హెచ్‌డి‌ఆర్ 10, హెచ్‌డి‌ఆర్ 10 ప్లస్ కూడా డిస్ ప్లేకి సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్‌లో ఎక్సినోస్ 1080 ప్రాసెసర్, ఎఆర్ఎం మాలి-జి 78 జిపియు, 12 జిబి వరకు ర్యామ్, 256 జిబి వరకు స్టోరేజ్ లభిస్తాయి.
undefined
కెమెరా గురించి మాట్లాడితే ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్ ఎఫ్ 1.79 ఎపర్చర్‌, ఈ లెన్స్‌తో ఫోర్ యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. రెండవ లెన్స్ 13 మెగాపిక్సెల్స్, మూడవ లెన్స్ కూడా 13 మెగాపిక్సెల్స్. వివో ఎక్స్ 60లో సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
undefined
వివో ఎక్స్ 60లో 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్ ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
undefined
వివో ఎక్స్ 60 ప్రో స్పెసిఫికేషన్వివో ఎక్స్ 60 లాగానే ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఒరిజినో ఓఎస్ 1.0 ఉంది. ఈ ఫోన్ లో 6.56-అంగుళాల హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 1080x2376 పిక్సెల్‌ల రిజల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్‌ వస్తుంది . హెచ్‌డి‌ఆర్ 10 ఇంకా హెచ్‌డి‌ఆర్ 10 ప్లస్ కి కూడా డిస్ ప్లే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో ఎక్సినోస్ 1080 ప్రాసెసర్, ఎఆర్ఎం మాలి-జి 78 జిపియు, 12 జిబి ర్యామ్, 256 జిబి వరకు స్టోరేజ్ ఉంది.
undefined
కెమెరా విషయానికొస్తే దీనిలో నాలుగు వెనుక కెమెరాలు ఉన్నాయి, ఇందులో మూడు కెమెరాలు వివో ఎక్స్ 60 కాగా, నాల్గవ లెన్స్ 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్. ఈ కెమెరాతో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. 60x సూపర్ జూమ్ కెమెరాతో లభిస్తుంది. సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ లెన్స్ అందించారు.
undefined
వివో ఎక్స్ 60 ప్రోలో 5 జి, 4 జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్ ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
undefined
undefined
click me!