మేక్ ఇన్ ఇండియా: భారతదేశంలో ఐఫోన్ -12 ఉత్పత్తిని ప్రారంభించిన ఆపిల్.. ధర ఎంతంటే ?

First Published Mar 12, 2021, 1:07 PM IST

క్యుపెర్టినో చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ భారతదేశంలో ఐఫోన్ -12 ఉత్పత్తిని ప్రారంభించింది. మా స్థానిక కస్టమర్ల కోసం ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అయిన ఐఫోన్ -12 ఉత్పత్తిని భారతదేశంలో ప్రారంభించినట్లు కంపెనీ గురువారం తెలిపింది. 

అయితే సంస్థ సరఫరాదారుని పేరును వెల్లడించలేదు. తైవానీస్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ తమిళనాడులోని ఆపిల్ ప్లాంట్లో ఈ ఐఫోన్ -12 ఉత్పత్తి చేయనున్నట్లు ఈ విషయం తెలిసిన రెండు వర్గాలు తెలిపాయి.
undefined
కానీ ఈ విషయంపై ఫాక్స్ కాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. యు.ఎస్, బీజింగ్ మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా ఆపిల్ ఉత్పత్తి కేంద్రాలను చైనా నుండి ఇతర దేశ మార్కెట్లకు తరలిస్తోంది.
undefined
ఆపిల్ ఆదేశాల మేరకు చైనా నుండి వియత్నాంకు ఐప్యాడ్‌లు, మాక్‌బుక్‌ల ఉత్పత్తిని తరలించడానికి ఫాక్స్ కాన్ సిద్ధంగా ఉందని ఈ విషయానికి సంబంధం ఉన్న ఒక వ్యక్తి నవంబర్‌లో నివేదించారు. వియత్నాం చెందిన మరో సరఫరా సంస్థ విస్ట్రాన్ ద్వారా ఆపిల్ 2017లో భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిని ప్రారంభించింది.
undefined
ఫాక్స్ కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ ఉమ్మడిగా భారతదేశంలో వచ్చే ఐదేళ్ళలో 90 మిలియన్ ఐఫోన్లను ఉత్పత్తి చేయనున్నాయి. భారత ప్రభుత్వం 6.7 బిలియన్ల స్మార్ట్‌ఫోన్ ఎగుమతి లక్ష్యాన్ని సాధించడంలో ఇది సహాయకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది.
undefined
భారతదేశంలో ఐప్యాడ్ టాబ్లెట్లను ఉత్పత్తి చేయడానికి ఆపిల్ యోచిస్తున్నట్లు గత నెలలో వార్తలు వచ్చాయి. మొబైల్, విడిభాగాల తయారీకి భారత్‌ను హబ్‌గా మార్చడానికి మా ప్రయత్నం ప్రపంచ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని కేంద్ర సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
undefined
భారతదేశంలో ఆపిల్ ఐఫోన్ -12 ఉత్పత్తి ఈ విషయాన్ని సూచిస్తుంది. ఇది పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.
undefined
click me!