Vivo S2: ధ‌ర మిడ్‌రేంజ్‌, ఫీచ‌ర్స్ మాత్రం హై రేంజ్‌.. వివో నుంచి కొత్త ఫోన్ వ‌చ్చేసింది

Published : Aug 06, 2026, 02:34 PM IST

Vivo S2: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో.. వివో ఎస్‌1 తర్వాత దాదాపు ఏడేళ్ల విరామం అనంతరం Vivo S2ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. పెద్ద బ్యాటరీ, కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే, కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ యూజ‌ర్ల‌ను ఆకట్టుకునేలా రూపొందించారు.

PREV
14
కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో ప్రీమియం అనుభవం

Vivo S2లో 6.83 అంగుళాల 1.5K 3D కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు స‌పోర్ట్‌ ఇవ్వడంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. అలాగే 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై పనిచేస్తుంది. పనితీరును మెరుగుపరచేందుకు మీడియాటెక్ డైమెన్సిటీ 7360 ట‌ర్బో ప్రాసెసర్‌ను అందించారు.

24
50MP కెమెరా.. 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్

ఫోటోగ్రఫీని ఇష్టపడే వారి కోసం ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ Sony IMX852 ప్రధాన కెమెరాను అందించారు. దీనికి తోడుగా 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ప్రత్యేకత ఏమిటంటే ముందు, వెనుక కెమెరాలతో కూడా 4K వీడియో రికార్డింగ్ చేసే అవకాశం ఉంది.

34
భారీ బ్యాటరీ.. IP69 ప్రొటెక్ష‌న్‌

Vivo S2లో 7050mAh సామర్థ్యంతో భారీ బ్యాటరీను అందించారు. దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ స్లిమ్ డిజైన్‌తో వస్తోంది. నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP68, IP69 రేటింగ్ కూడా ఇచ్చారు. ఈ ఫోన్ బ్లూ, బ్రాంజ్, వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

44
ధ‌ర ఎంతంటే.?

Vivo S2ను కంపెనీ రెండు స్టోరేజ్ వేరియంట్లలో విడుదల చేసింది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.45,999గా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ Vivo India అధికారిక ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో లభించనుంది. ఆగస్టు 11 నుంచి సేల్స్‌ ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్, అలాగే ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories