యూట్యూబ్ నుండి 8.30 కోట్ల వీడియోలు, 70 లక్షల కామెంట్లు డిలెట్.. కారణం ఏంటంటే ?

First Published Apr 8, 2021, 12:38 PM IST

ప్రముఖ ఆన్ లైన్ వీడియో స్ట్రిమింగ్ యాప్ యూట్యూబ్  2018 నుండి తన ప్లాట్‌ఫాం పై సుమారు 8.30 కోట్ల వీడియోలను తొలగించింది. కంటెంట్ కాపీరైట్, అశ్లీలత, అభ్యంతరకరమైన కారణంగా ఈ వీడియో తొలగించినట్లు తెలిపింది.

అలాగే ఈ వీడియోలతో పాటు 700 కోట్ల కామెంట్లను కూడా డిలెట్ చేసింది. ప్రతి 10 వేల వీడియోలలో అభ్యంతరకరమైన వీడియోల సంఖ్య 16 నుండి 18 వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.
undefined
కంపెనీ సెక్యూరిటీ అండ్ విశ్వసనీయత బృందం డైరెక్టర్ జెన్నిఫర్ ఓ'కానర్ ప్రకారం అభ్యంతరకరమైన వీడియోల శాతం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ 94% అభ్యంతరకరమైన వీడియోలను ఎవరైనా చూడటానికి ముందు తొలగిస్తుంది.
undefined
ప్రతిరోజూ కోట్లాది వీడియోలు అప్‌లోడ్ అవుతున్నప్పుడు అభ్యంతరకరమైన వీడియోల శాతం కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉండొచ్చు. మూడేళ్ల క్రితం వరకు 10 వేల వీడియొలలో 63 నుంచి 72 నిష్పత్తి వీడియోలు ఉన్నాయి. ఈ వీడియోలలో వినియోగదారులు అప్‌లోడ్ చేసిన వీడియోలు, యూట్యూబ్, ఫేస్‌బుక్ ల లో అప్ లోడ్ చేసిన వీడియొలు వినియోగదారులకు పెద్ద మొత్తంలో కంటెంట్‌ను అందిస్తున్నాయి.
undefined
ఫేస్‌బుక్ డేటా లీక్‌లపై ఐర్లాండ్ దర్యాప్తుభారతదేశంలోని 61 మిలియన్ల మంది ఇంకా ప్రపంచంలోని 53.3 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా లీకేజీపై ఐర్లాండ్ దర్యాప్తు ప్రారంభించింది. ఎందుకంటే ఈ డేటా లీక్ 2019కి చెందినదని పేర్కొంటున్న ఫేస్‌బుక్ వాదనను డేటా ప్రొటెక్షన్ కమిషన్ అంగీకరించలేదు.
undefined
undefined
click me!