వార్నింగ్ : మీ ఫోన్ లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలెట్ చేయండి.. లేదంటే మీ వాట్సాప్ హ్యాక్ కావొచ్చు..

First Published Apr 8, 2021, 11:45 AM IST

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఒక కొత్త హెచ్చరిక జారీ చేయబడింది. అదేంటంటే గత కొన్ని రోజులుగా ఈ యాప్ లో గురించి  చాలా వైరల్ అవుతోంది. 

ఈ యాప్ పేరు ఫ్లిక్స్ఆన్‌లైన్ ఇది ఇంటెర్నేషనల్ కంటెంట్ అందించే ఓ‌టి‌టి ఫ్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ యాప్ కి క్లోన్ యాప్. మీరు నెట్‌ఫ్లిక్స్ యాప్ లో గ్లోబల్ కంటెంట్‌ కోసం నెలవారి సబ్ స్క్రిప్షన్ చేసుకొని చూడవచ్చు.
undefined
నెట్‌ఫ్లిక్స్ లోని గ్లోబల్ కంటెంట్‌ను సబ్ స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా చూపించడానికే ఫ్లిక్స్ఆన్‌లైన్ యాప్ ని తీసుకొచ్చారు అని వాదన. అయితే అసలు ఏమిటంటే ఈ ఫ్లిక్స్ఆన్‌లైన్ యాప్ ప్రత్యేకంగా వాట్సాప్ యాప్‌ మెసేజెస్ ని గుఢచర్యం చేయడానికి రూపొందించారు. ఫ్లిక్స్ఆన్‌లైన్ యాప్ వాట్సాప్ అన్ని నోటిఫికేషన్‌లను రహస్యంగా హ్యాకర్లకు చేరవేస్తుంది.
undefined
సెర్చ్ ఇంజన్ గూగుల్ ఇప్పుడు ఈ యాప్ ని ప్లే-స్టోర్ నుండి తీసివేసింది, అయితే ఒకవేళ మీరు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసి ఉంటే వెంటనే డిలెట్ చేయడం మంచిది. ఈ యాప్‌ను ఇప్పటివరకు వందలాది మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.
undefined
సైబర్ సెక్యూరిటి సంస్థ చెక్‌పాయింట్ మొదట ఈ యాప్ గురించి సమాచారం ఇచ్చింది. ఈ యాప్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అన్నీ నోటిఫికేషన్‌లతో సహా వివిధ అనుమతులను తీసుకుంటుందని ఇంకా అన్ని ఇతర యాప్స్ లాగానే ఈ యాప్ కనిపిస్తుంది అని చెక్‌పాయింట్ నివేదిక పేర్కొంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేశాక నోటిఫికేషన్ ప్యానెల్ పైభాగంలో ఉంటుంది.
undefined
ఫ్లిక్స్ఆన్‌లైన్ యాప్ ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ యాప్ మీ వాట్సాప్‌లోని అన్ని మెసేజులను చదువుతుంది ఇంకా స్వయంచాలకంగా హ్యాకర్‌కు చూపిస్తుంది. హ్యాకర్‌కు వాట్సాప్‌ మెసేజెస్ చూపించడంతో పాటు ఈ యాప్ మీ ఫోన్ గురించి పూర్తి సమాచారం హ్యాకర్‌కు చేరే విధంగా ఒక లింక్‌ను కూడా పంపుతుంది. ఇటువంటి మాల్వేర్లను "వార్మబుల్" అని పిలుస్తారు, అంటే అది ఆటోమేటిక్ గా మీ ఫోన్ లో వ్యాపిస్తుంది.
undefined
click me!