అయితే జియోలో కూడా ఎయిర్‌టెల్ లాగానే రెండు సర్వీసులు ఉన్నాయి. అందులో మొదటిది జియో టెలికాం రెండవది జియో ఫైబర్. జియో ఫైబర్ భారతదేశంలో మొదటి నుండి బాగా ప్రాచుర్యం పొందింది. దీనికి అతిపెద్ద కారణం వాటి ప్లాన్ ధరలు. ఇప్పుడు జియో ఫైబర్ కోసం కొత్త ప్లాన్ లను ప్రకటించింది. అదేంటో తెలుసుకుందాం ...
undefined
రిలయన్స్ జియో కొన్ని ఫైబర్ ప్లాన్ లపై అదనపు వాలిడిటీ ఇస్తున్నట్లు ప్రకటించింది. జియో ఫైబర్ వార్షిక, అర్ధ-సంవత్సరం ప్లాన్ లపై 30 రోజుల అదనపు వాలిటిని అందిస్తున్నాయి. మీరు జియో ఫైబర్ వార్షిక ప్లాన్ తీసుకుంటే, మీకు 30 రోజులు అదనపు వాలిడిటీ లభిస్తుంది.
undefined
జియోఫైబర్ వార్షిక ప్లాన్ ప్రారంభ ధర రూ .4,788 నుండి మొదలవుతుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 360 రోజులు. కానీ ఇప్పుడు ఈ ప్లాన్ మొత్తం 395 రోజుల వాలిడిటీని అందిస్తుంది. అంటే ఈ ప్లాన్ వాలిడిటీ 13 నెలలు వరకు ఉంటుంది. అలాగే 6 నెలల ప్లాన్ తో 15 రోజుల అదనపు వాలిడిటీ ఇస్తున్నారు.
undefined
కొత్త ఆఫర్ ఏ ప్లాన్ పై వర్తిస్తుందిజియో అదనపు వాలిడిటీ ఆఫర్ రూ .4,788 నుండి రూ .1,01,988 వరకుఉన్న వార్షిక ప్లాన్ లపై వర్తిస్తుంది. అలాగే అర్ధ సంవత్సరం అంటే 6 నెలల ప్లాన్ రూ .2394 నుండి రూ .50,994 వరకు ఉన్న ప్లాన్‌లపై కూడా లభిస్తుంది.
undefined
గత ఏడాది ఆగస్టులో జియో ఫైబర్ ప్లాన్‌లను అప్‌డేట్ చేసింది, దీంతో జియో ఫైబర్ ప్లాన్ ప్రారంభ ధర రూ .399గా మారింది. ఈ ప్లాన్ తో ఆన్ లిమిటెడ్ అప్‌లోడ్‌లు, డౌన్‌లోడ్‌లు చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తోయి మీకు 30ఎంబిపిఎస్ స్పీడ్ లభిస్తుంది. అలాగే అన్ని ప్లాన్లపై ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు.
undefined