వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లేతో ఫ్లిప్‌కార్ట్ మొట్టమొదటి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్, ధర ఇవే..

First Published | Sep 27, 2021, 7:08 PM IST

ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ మార్క్యూ ఎం3 స్మార్ట్‌ను విడుదల చేసింది. ఇంతకుముందు ఫ్లిప్‌కార్ట్  మార్క్యూ బ్రాండ్ కింద స్మార్ట్ టీవీలు, స్పీకర్‌లను  తీసుకొచ్చారు. మార్క్యూ ఎం 3 స్మార్ట్ అనేది వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లేతో కూడిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. 

అంతేకాకుండా ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. మార్క్యూ ఎం 3 స్మార్ట్ సేల్ ఫ్లిప్‌కార్ట్  బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఉంటుంది.


భారతదేశంలో మార్క్యూ ఎం 3 స్మార్ట్ స్మార్ట్‌ఫోన్‌ ధర
మార్క్యూ ఎం3 స్మార్ట్ ఫోన్ ధర రూ .7,999, అయితే సేల్ సమయంలో దీనిని రూ .6,299 కి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ లో 2జి‌బి ర్యామ్, 32 జి‌బి స్టోరేజ్ ఇచ్చారు . ఈ ఫోన్ అక్టోబర్ 7 నుండి అందుబాటులోకి వస్తుంది. మార్క్యూ ఎం 3 స్మార్ట్ స్మార్ట్ ఫోన్ బ్లాక్, నీలం రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మైక్రోమ్యాక్స్ ఇన్ 2 బి, రియల్‌మీ సి 21 వై, లావా జెడ్ 2 ఎస్ వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది.

స్పెసిఫికేషన్లు

మార్క్యూ ఎం3  స్మార్ట్ లో ఆండ్రాయిడ్ 10 ఇచ్చారు. 720x1560 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.088-అంగుళాల హెచ్‌డి+ డిస్‌ప్లే, 2.5డి కర్వ్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 1.6GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది, దీని పేరు, మోడల్ సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు.  2జి‌బి ర్యామ్, 32 జి‌బి స్టోరేజ్ లభిస్తుంది, దీనిని మెమరీ కార్డ్ సహాయంతో 256జి‌బి  వరకు పెంచుకోవచ్చు.

Latest Videos


కెమెరా

మార్క్యూ ఎం3 స్మార్ట్ కెమెరా మాట్లాడితే ఫ్లిప్‌కార్ట్ నుండి వచ్చిన ఈ మొదటి ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో ప్రైమరీ లెన్స్ 13 మెగాపిక్సెల్స్. రెండవ లెన్స్ మెగాపిక్సెల్స్  గురించి కంపెనీసమాచారం ఇవ్వలేదు. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫి కెమెరా ఉంటుంది. నైట్ మోడ్, బ్యూటీ మోడ్, స్లో మోషన్, టైమ్‌లాప్స్ మొదలైన ఫీచర్లు కెమెరాతో అందించారు.

మార్క్యూ ఎం3 స్మార్ట్ బ్యాటరీ

ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, అలాగే 24 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ క్లెయిమ్ చేయబడింది. ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్ ఇచ్చారు, అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. కనెక్టివిటీ కోసం 3.5ఎం‌ఎం ఆడియో జాక్, మైక్రో యూ‌ఎస్‌బి, డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, వై-ఫై, బ్లూటూత్ వి4.2, జి‌పి‌ఎస్, 4జి వంటి ఫీచర్లు ఇచ్చారు.

click me!