టాప్ 5 ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్ ఫోన్లు ఏంటో తెలుసా? ధర కూడా రూ. 20వేల లోపే..

Published : Jan 28, 2025, 01:58 PM IST

ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతోంది. కస్టమర్లకు బెస్ట్ ప్రాడక్ట్ ఇవ్వడానికి కంపెనీలు పోటీ పడుతున్నాయి. బెస్ట్ బ్యాటరీ లైఫ్, స్పీడ్ చార్జింగ్ తో పాటు తక్కువ ధరలో లభించే ఈ స్మార్ట్ ఫోన్లు ఏంటో ఓసారి చూసేయండి.

PREV
16
టాప్ 5 ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్ ఫోన్లు ఏంటో తెలుసా? ధర కూడా రూ. 20వేల లోపే..

ప్రస్తుతం చాలా మంది ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్.. తక్కువ ధరకు రావాలని కోరుకుంటున్నారు. అలాంటి వారికోసం రూ .20,000 లోపున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఏంటో ఇక్కడ చూద్దాం.

26
Realme Narzo 70 Pro

Realme Narzo 70 Pro దాని 67W పవర్ అడాప్టర్‌తో ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. 20% నుంచి  100% కి కేవలం 42 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. PC Mark బ్యాటరీ టెస్ట్‌లో, 5,000mAh బ్యాటరీ 16 గంటల 24 నిమిషాల బ్యాకప్ ఇచ్చింది. ఈ ధరలో ఇది బెస్ట్ కెమెరా ఫోన్.

Realme Narzo 70 Proలో MediaTek Dimensity 7050 ప్రాసెసర్, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7- అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే, 50MP OIS ప్రైమరీ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

36
OnePlus Nord CE 4 Lite

OnePlus Nord CE 4 Lite దాని 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 20% నుంచి 100% వరకు కేవలం 50 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. PC Mark బ్యాటరీ టెస్ట్‌లో దాని 5,500mAh బ్యాటరీ 11 గంటల 30 నిమిషాల బ్యాకప్ ఇచ్చింది. Qualcomm Snapdragon 695 CPU, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్, 50MP ప్రైమరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా OnePlus Nord CE 4 Liteలో ఉన్నాయి.

46
Redmi Note 14

Redmi Note 14 దాని 45W ఛార్జింగ్‌తో 32 నిమిషాల్లో 20% నుంచి 100% వరకు ఛార్జ్ అవుతుంది. ఇది మార్కెట్లో బెస్ట్ బ్యాటరీ ఫోన్. దీని 5,110mAh బ్యాటరీ 19 గంటల 21 నిమిషాలు బ్యాకప్ ఇస్తుంది.

Redmi Note 14లో MediaTek Dimensity 7025 Ultra SoC, 6.67-అంగుళాల FHD+ 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, 20MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

56
Tecno POVA 6 Pro

Tecno POVA 6 Pro దాని 70W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 20% నుంచి 100% వరకు 51 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. PCMark బ్యాటరీ టెస్ట్‌లో, 6,000mAh బ్యాటరీ 15 గంటల 56 నిమిషాలు బ్యాకప్ ఇచ్చింది. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్, MediaTek Dimensity 6080 CPU, 108MP ప్రైమరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా Tecno POVA 6 Proలో ఉన్నాయి.

66
Realme P1

Realme P1 తో వచ్చే 45W ఛార్జర్ దాని బ్యాటరీని 48 నిమిషాల్లో 20% నుంచి 100% వరకు ఛార్జ్ చేస్తుంది. PC Mark బ్యాటరీ టెస్ట్‌లో 5,000mAh బ్యాటరీ 16 గంటల 20 నిమిషాలు బ్యాకప్ ఇచ్చింది.

రూ. 20,000 లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లలో Realme P1 ఒకటి. Realme P1లో 50MP ప్రైమరీ కెమెరా, MediaTek Dimensity 7050 CPU, 16MP సెల్ఫీ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్ ఉన్నాయి.

click me!

Recommended Stories