భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మొబైల్ కంపెనీలకు ఒక అడ్డాగా మారింది. ఎందుకంటే చాలా కంపెనీలు కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఎప్పటికప్పుడు పోటీపడుతుంటాయి. కొన్ని సంస్థలు చౌకైనా ఫోన్లను ఐదు వేలకి లాంచ్ చేస్తే మరో సంస్థ జియో ఆఫర్ పేరుతో రూ.3,500-రూ.4,000కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తుంది.
నేడు కస్టమర్లకు స్మార్ట్ ఫోన్ కొనేందుకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అందువల్ల వారు తమ బడ్జెట్‌లో దేనిని కోనాలో ఎంచుకోలేకపోతున్నారు. ఇప్పుడు రూ .12,000 బడ్జెట్‌లోని కొన్ని బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల గురించి మీకోసం...
26
రెడ్ మీ నోట్ 9 - ధర రూ.11,999
రెడ్ మీ నోట్ 9 మీడియా టెక్ హెలియో జి85 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్‌లో 6.53 అంగుళాల డిస్‌ప్లే, నాలుగు వెనుక కెమెరాలు ఉన్నాయి, దీని ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్. 13 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాలో ఇచ్చారు. అంతేకాకుండా దీనిలో 5020mAh బ్యాటరీ ఇచ్చారు.
36
మోటో జి30 - ధర రూ. 10,999
ఈ ఫోన్ దాని విభాగంలో బెస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్. ఈ ఫోన్ డేటా ఎండ్ టు ఎండ్ సెక్యూర్. దీనికి 6.5-అంగుళాల డిస్‌ప్లే అంతేకాకుండా స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ ఉంది. ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
46
రియల్‌మీ నార్జో 20- ధర రూ. 10,499
12వేల శ్రేణిలో రియల్‌మీ నార్జో 20 గొప్ప ఫోన్. మీడియాటెక్ హీలియో జి85 ప్రాసెసర్‌తో 6000mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. దీని ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
56
టెక్నో కామన్ 16- ధర రూ .11,499
64 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్న టెక్నో కామన్ 16 ప్రస్తుతం భారత మార్కెట్లో చౌకైన ఫోన్. దీనికి నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్, కెమెరాతో ఆటో ఐ ఫోకస్ కూడా ఉంది. ఇందులో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫోన్ 6.8-అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జి70 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీని అందించారు.
66
పోకో ఎం3- ధర రూ .11,499
పోకో ఎం3 కూడా ఈ విభాగంలో మంచి బడ్జెట్ ఫోన్. దీనికి స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6.53 అంగుళాల డిస్‌ప్లే లభిస్తుంది.