ఏప్రిల్ 1 నుండి మొబైల్స్, ఛార్జర్లు, టీవీల ధరలు పెంపు.. దేనిపై ఎంత పెరగనుందంటే ?

First Published | Mar 30, 2021, 8:31 PM IST

ఏప్రిల్ 1కి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి నెలలో బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక కీలక ప్రకటన చేశారు. అదేంటంటే   బడ్జెట్ 2021లో మొబైల్ ఫోన్ భాగాలు, ఛార్జర్‌లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే ఏప్రిల్ 1 నుండి సాధారణ ప్రజలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులైన ఛార్జర్స్, కేబుల్స్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, మొబైల్ ఫోన్‌లు ఖరీదైనవిగా మారనున్నాయి. 1 ఏప్రిల్ 2021 నుండి వీటి ధరల పెంపు అమల్లోకి రానున్నాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై దిగుమతి సుంకం ఎంత పెంచనున్నారో, ధరలను ఎంత పెరగవచ్చో తెలుసుకోండి..
undefined
2021 బడ్జెట్‌లో ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచనున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో మొదటిది వైర్ (అన్ని రకాల వైర్లు). దీనిపై దిగుమతి సుంకం ప్రస్తుతం 7.5 శాతంగా ఉంది, దీనిని 10 శాతానికి పెంచారు, అంటే ఏప్రిల్ 1 నుండి వైర్ ధరలు 2.5 శాతం వరకు పెరగవచ్చు.
undefined

Latest Videos


ఛార్జర్లు, ఎడాప్టర్లు, ఇతర ఉపకరణాలుబడ్జెట్ 2021లో ప్రభుత్వం ప్రస్తుతం సున్నాగా ఉన్న ఛార్జర్లు, ఎడాప్టర్లు, కేబుల్స్ వంటి ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని 2.5 శాతానికి పెంచింది. అలాగే ఛార్జర్‌లో ఉపయోగించే ప్లాస్టిక్‌పై ఈ ఛార్జీలు 10 నుండి 15 శాతానికి పెంచారు. ఛార్జర్లు, కేబుల్స్, ఎడాప్టర్లు, యుఎస్‌బి ఉపకరణాల ధరలను 1 ఏప్రిల్ 2021 నుండి పెరగావచ్చు.
undefined
హై ఎండ్ అండ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లుకనెక్టర్లలో ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబుల్ పై (పిసిబిఎ) దిగుమతి సుంకం, కెమెరా సెటప్‌ను 15 శాతానికి పెంచడంతో హై ఎండ్, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో మంచి కెమెరా, టైప్-సి పోర్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్లు ఖరీదైనవిగా మారనున్నాయి.
undefined
ఫోన్ రిపేర్కెమెరా, కనెక్టర్, ఇతర భాగాలు ఖరీదైనవిగా మారితే వాటి రిపైర్ కూడా ఖరీదైనదిగా అవుతుంది. లిథియం-అయాన్ బ్యాటరీలపై దిగుమతి సుంకాలను కూడా పెంచారు. ఇలాంటి పరిస్థితిలో బ్యాటరీలని మార్చడం కూడా ఖరీదైనది. ఫోన్ సర్క్యూట్, కెమెరా సెటప్, ఛార్జింగ్ పోర్టుపై దిగుమతి సుంకం 2.5 శాతం, ఛార్జర్ ఇంకా ఛార్జర్ భాగాలపై 15 శాతం ఉంటుంది. బ్యాటరీ గురించి చెప్పాలంటే ప్రస్తుతం వాటిపై దిగుమతి సుంకం లేదు, కానీ ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ లేదా బ్యాటరీ ప్యాక్ ఇన్పుట్ పై 2.5 శాతం దిగుమతి సుంకం ఉంటుంది.
undefined
ఆపిల్ తరువాత శామ్సంగ్ ఇంకా ఇతర కంపెనీలు ఫోన్‌తో పాటు బాక్స్‌లో కనిపించే ఛార్జర్, హెడ్‌ఫోన్లు, కేబుల్‌ను కూడా తొలగించనున్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ప్రత్యేక ఛార్జర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
undefined
ఎసి-ఫ్రీజ్ కూడా ఎసిపై సుంకం 12.5% ​​నుండి 15% కు పెంచనున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎసి ధరలు మరింత పెరగనున్నాయి. ఫ్రిజ్‌లపై సుంకం కూడా 15 శాతానికి పెంచనున్నారు. అంతేకాకుండా ఎల్‌ఈడీ లైట్లపై 5 నుంచి 10 శాతానికి పెంచారు. ఇంకా ఫ్యాన్, వాషింగ్ మెషిన్ మొదలైనవి కొనడం కూడా ఖరీదైనవిగా మారనున్నాయి.
undefined
click me!